మళయాళీ భామ నిత్యా మీనన్ కి ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ గా ఎంత పేరుందో.. ఈమెకు బాగా పొగరు అని కూడా అంతే టాక్ ఉంది. ఏదైనా ఆఫర్ గురించో, మరేదైనా టాపిక్ గురించో నిత్యతో మాట్లాడాలని అనుకుంటే.. కనీసం తనను కలిసేందుకు అంత తేలిగ్గా అంగీకరించదని అంటారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈమెకు తలపొగరు అనేస్తారు. మరి ఇందులో నిజమెంత అనే ప్రశ్నకు తనే సమాధానం ఇచ్చింది నిత్యా మీనన్.
"నాతో పని చేసే ముందు అందరూ ఇలాగే అనుకుంటారని నాకు తెలుసు. అయితే కొన్నాళ్లు వర్క్ చేశాక.. అది తప్పు అనే విషయం వారికి అర్ధమవుతుంది. మీ గురించి ఇలా తప్పుగా అర్ధం చేసుకున్నామని చాలామంది నాతో చెప్పారు. నా చుట్టూ వచ్చిన రూమర్స్ గురించి చెప్పి బాధ పడతారు" అని చెప్పింది నిత్యామీనన్. ఇలాంటివి విన్నపుడు తన గురించి ఇంత బ్యాడ్ గా ఎందుకు అనుకుంటున్నారో అని బాధపడ్డా.. తర్వాత సరిపెట్టుకుంటానని అనింది నిత్యా మీనన్.
అయితే తను అంత తేలిగ్గా కలిసిపోయే మెంటాలిటీ కాకపోవడమే ఇలాంటి రూమర్స్ కి కారణం కావచ్చని అభిప్రాయపడింది ఈ బ్యూటీ. అయినా.. తను ఇలా ఉండడమే తన కేరక్టర్ కాబట్టి.. రిజర్వడ్ గా ఉంటానని చెప్పడం విశేషం. చాలా సెలక్టివ్ గా కేరక్టర్లు ఎంచుకునే నిత్యామీనన్.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సరసన జనతా గ్యారేజ్ లో సెకండ్ హీరోయిన్ గా చేయనుంది.