కాంట్రోవర్షియల్‌ లేడీ వరుసగా పండగే

Update: 2016-08-17 05:30 GMT
'ప్రభాస్ ఎవరు?' 'ముసలి హీరోలతో చేయను' 'జనతా గ్యారేజ్ నా కెరియర్ లో పెద్ద సినిమా' వంటి కామెంట్లతో తెలుగు సినిమా ఇండస్ర్టీలో పెద్ద రచ్చనే క్రియేట్ చేసింది మలయాళీ ముద్దుగుమ్మ నిత్యా మీనన్. అందానికి అందం.. టాలెంటుకు టాలెంట్ ఉండి.. జూనియర్ సౌందర్య అంటూ అభిమానులచే ముద్దుగా పిలిపించుకుంటున్న ఈ హాటీని.. కాంట్రోవర్షియల్‌ లేడీ అనకుండా ఉండలేం.

ఇప్పుడు విశేషం ఏంటంటే.. ఆ మధ్యన వరుసగా ఒకే టైములో సన్నాఫ్‌ సత్యమూర్తి, ఓకె బంగారం వంటి సినిమాలతో అలరించిన ఈ క్యూట్ లేడీ.. ఇప్పుడు కూడా మరోసారి అలాంటి ఫీట్ చేయబోతోంది. ఏకంగా మూడు వారాల్లో ఈమె నటించిన మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. ముందుగా ఆగస్టు 26న '100 డేస్ ఆఫ్‌ లవ్' సినిమా రిలీజవుతోంది. ఆ తరువాత ఆమె నటించిన మొదటి 'పెద్ద సినిమా' సెప్టెంబర్ 2న రాబోతోంది. అవును 'జనతా గ్యారేజ్' రిలీజ్ అప్పుడే. అలాగే 9న విక్రమ్‌ హీరోగా రూపొందిన 'ఇంకొక్కడు' వస్తోంది. మొత్తానికి ఈమె అభిమానులకు ఇలా వరుస సినిమాలతో పండగే కదూ.

నిజానికి స్టార్ హీరోయిన్లుగా చెప్పబడుతున్న బడా హీరోయిన్లకు ఎవ్వరికీ ఇలా వరుస రిలీజులు మాత్రం లేవు. నిత్యా మీనన్ సదరు సినిమాల్లో చేసేది చిన్న చిన్న పాత్రలే కాబట్టి.. ఆమె తక్కువ టైములో ఎక్కువ సినిమాల చేసేయడం అవన్నీ ఇలా ఒకేసారి రిలీజుకు రెడీ అయపోవడం జరిగిపోతున్నాయి. అది సంగతి.
Tags:    

Similar News