తీగలా మారమని అడిగారటగా...

Update: 2016-10-04 17:13 GMT
స్క్రీన్ పై ఎందరు ఉన్న తన ట్యాలెంట్ తో డామినేట్ చేసేయడం నిత్యామీనన్ కు పెద్ద మేటరేం కాదు. అందుకే ఈ బ్యూటీకి అవకాశాల విషయంలో కొదువ లేదు. మామూలుగానే బొద్దుగా కనిపించే ఈ భామ.. ఇప్పుడు బాగా లావయిపోయిందనే టాక్ గట్టిగానే ఉంది. ముఖ్యంగా జనతా గ్యారేజ్ లో నిత్యామీనన్ లుక్స్ కి నెగిటివ్ మార్కులే పడ్డాయి.

అయితే.. వెంకటేష్- కిషోర్ తిరుమల కాంబినేషన్ లో రూపొందనున్న మూవీలో లీడ్ రోల్ కి నిత్యానే ఫైనల్ చేశారు. 'ఆడాళ్లూ.. మీకు జోహార్లు' అనే టైటిల్ పై రూపొందనున్న ఈ చిత్రం కోసం.. నిత్యామీనన్ కు బరువు తగ్గించుకోవాల్సిందిగా కోరారట దర్శక నిర్మాతలు. ట్యాలెంట్ విషయంలో కొదువ లేకపోయినా.. మరీ హెవీగా కనిపిస్తుండడమే ఇందుకు కారణంగా చెప్పచ్చు. మన దగ్గర లావుగా ఉండే హీరోయిన్స్ ఉంటారు కానీ.. మిగతావాళ్లతో పోల్చితే హైట్ విషయంలో  పైగా ఫుడ్ విషయంలో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ తనకు లేవని ఓపెన్ గా చెప్పేసే నిత్యాకి.. వెంకీ సినిమా విషయంలో సూచనలు అందాయి. నిజానికి ఈ మూవీ స్టోరీ పరంగా.. ఓ కుర్రదాన్ని చూసి పడిపోయే నడివయస్కుడి కథ ఇది. ఈ పాత్రకు న్యాయం చేయాలంటే.. అమ్మాయి కాసింత మెరుపుతీగలా ఉండాలన్నది దర్శకుడి ఆలోచనగా తెలుస్తోంది. మరి ఈ ముత్యం లాంటి నిత్య.. తీగలా మారేందుకు సై అంటుందో లేదో!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News