పొట్టిగా.. కాస్త బొద్దుగా ఉండేవారు హీరోయిన్ గా రాణిస్తారా? అంటే.. నో.. నెవ్వర్ అనేస్తారు.కానీ.. నిత్యామీనన్ మాటేమిటిన అంటే మాత్రం.. నిజమే కదూ? అంటూ ఆలోచనలో పడతారు. అందానికి అందం.. దానికి మించిన నటన నిత్యా మీనన్ సొంతం. పాత్ర ఏదైనా దానిలోకి పరకాయ ప్రవేశం చేసినట్లుగా ఉండే ఆమె.. ఇటీవల కాలంలో తెలుగు సినిమాల్లో చేస్తున్నది తక్కువ. ఆమె ఫోకస్ బాలీవుడ్ మీద పడినట్లుగా చెబుతారు.
సౌత్ లో బాషలకు అతీతంగా దాదాపు అన్ని వుడ్డుల్లోనూ పని చేసినఆమె ఈ ఏడాది మిషన్ మంగళ్ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. పదేళ్లు ఇండస్ట్రీలో ఉన్న ఆమె.. రీసెంట్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూనే.. తనదైన గుర్తింపు పొందే ప్రయత్నం చేశారు. మిషన్ మంగళ్ మూవీ ఆమెకు గుర్తింపును ఇచ్చింది. అయితే.. ఆ సినిమా విజయవంతమైన తర్వాత కూడా ఆమె ఏ సినిమాకు కమిట్ కాలేదు.
ఎందుకిలా? అంటే.. మిషన్ మంగళ్ తర్వాత మంచి కథ కోసం తాను ఎదురుచూస్తున్నట్లు చెప్పింది నిత్య. మంచి స్క్రిప్టు రాకపోవటంతోనే తాను ఓకే చెప్పలేదని చెబుతున్నా? ఇదంతా నిజమేనా? అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు పలువురు. నటిగా ఆమెను వంక పెట్టాల్సిన అవసరం లేకున్నా.. ఇప్పటివరకూ జాతీయ అవార్డును కూడా ఆమె సొంతం చేసుకోలేకపోయారు.
పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉండి.. పలు హిట్ సినిమాల్లో నటించిన నిత్యాకు జాతీయ అవార్డు రాకపోవటాన్ని ఆమె లైట్ తీసుకుంటున్నారు. నటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించటం సంతోషమే అయినా.. ప్రేక్షకుల మెచ్చిన మంచి సినిమాలో భాగమై.. ఆ సినిమాలో తన నటనకు జాతీయ అవార్డు రావాలనుకుంటున్నట్లుగా ఈ బొద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఆశలు చాలానే ఉన్నాయి.. మరి అవెప్పటికి తీరుతాయో చూడాలి.