ఇలా కూడా మెంటల్ ఎక్కించేస్తున్న బ్యూటీ..!

Update: 2022-11-04 16:30 GMT
ఆల్రెడీ కోలీవుడ్ లో సినిమాలతో పాటుగా వివాదాల్లో కూడా నిలిచిన అందాల భామ నివేదా పేతురాజ్ తెలుగులో వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చ్జేసిన మెంటల్ మదిలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ అవడం వల్ల ఆ డైరక్టర్ తీసిన బ్రోచేవారెవరురా సినిమాలో కూడా ఆమెని రిపీట్ చేశాడు. ఇక అప్పటినుంచి తెలుగులో వరుస సినిమాలు చేస్తూ వస్తుంది నివేదా పేతురాజ్. తెలుగుతో పాటుగా తమిళ సినిమాల్లో కూడా దూసుకెళ్తున్న నివేదా పేతురాజ్ కేవలం సినిమాలే కాదు సోషల్ మీడియా ఫోటోస్ తో కూడా తన ఫాలోవర్స్ ని అలరిస్తుంది.

అంతేకాదు అమ్మడికి రేసింగ్ అంటే చాలా ఇష్టం. అందులో కూడా ఆమె నైపుణ్యత సాధించాలని చూస్తుంది. అప్పుడప్పుడు రేస్ క్లబ్ లో కార్ రేస్ చేస్తున్న వీడియోలని షేర్ చేస్తుంది నివేదా పేతురాజ్.

అయితే రేసర్ గా ఉండాలంటే ఫిట్ నెస్ కంపల్సరీ అందుకే అమ్మడు సినిమాలు లేని టైం లో ఎక్కువ శాతం జిమ్ లోనే గడిపేస్తుంది. లేటెస్ట్ గా జిమ్ చేస్తున్న వీడియోని షేర్ చేసింది నివేదా పేతురాజ్. పర్ఫెక్ట్ బాడీ షేప్ కోసం నివేదా పేతురాజ్ బాగానే కష్టపడుతుందని చెప్పొచ్చు. నివేదా చేస్తున్న ఈ జిమ్ వర్క్ అవుట్స్ వీడియో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.         

జిమ్ డ్రెస్ లో గ్లామర్ ట్రీట్ కూడా అందిస్తుంది అమ్మడు. మెంటల్ మదిలో బ్యూటీ వర్క్ అవుట్స్ తో కూడా మెంటల్ ఎక్కించేస్తుందని చెప్పొచ్చు. ఎలా పడితే అలా సినిమాలు చేయకుండా తనకు నచ్చిన కథలు.. పాత్రలతోనే సినిమాలు చేస్తూ వస్తుంది నివేదా. అందుకే అమ్మడి సినిమాలకు అంత డిమాండ్ ఏర్పడింది. లాస్ట్ ఇయర్ పాగల్ సినిమా థియేట్రికల్ రిలీజై హిట్ అవగా బ్లడీ మేరి అని ఓటీటీ మూవీతో కూడా సూపర్ హిట్ అందుకుంది ముద్దుగుమ్మ. నివేదా సినిమా చేస్తుంది అంటే అందులో ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుంది అనేలా చేసుకుంది.

ఇక నివేదా రాబోతున్న సినిమాలు చూస్తే మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా నివేదా పేతురాజ్ నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా అక్టోబర్ 31 లేడీస్ నైట్ సినిమాలో కూడా నటిస్తుంది అమ్మడు. ఈ సినిమాలతో అమ్మడు మరోసారి తెలుగులో తన సత్తా చాటనుంది. అందంతో పాటుగా తనకు ఇచ్చిన క్యారక్టర్ కి నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తూ వస్తున్న నివేదా పేతురాజ్ కి తెలుగులో స్టార్ సినిమాలు వచ్చి ఇక్కడ స్టార్ స్టేటస్ అందుకోవాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News