నిజానికి మేకప్ లో ఉన్న సెలబ్రిటీల ముఖానికి.. మేకప్ తీసిన ముఖానికి చాలా తేడా ఉంటుంది. ఈపాటికే కొంతమంది హీరోయిన్లు కొన్నిసార్లు షేర్ చేసే ఫోటోలను చూస్తే మనకు విషయం అర్ధమవుతుంది. అలాంటప్పుడు మేకప్ లేని ఫోటోలను చూస్తే రచ్చ చేయడం పెద్ద అవసరం లేని విషయం అనే చెప్పాలి.
ఈరోజు ట్విట్టర్లో ఒక ఫోటో షేర్ చేసింది మలయాళీ భామ నివేథా థామస్. మొదటి సినిమాతో టాలీవుడ్ లో తన టాలెంట్ చూపించిన ఈ పిల్ల.. జెంటిల్మన్ తరువాత నిన్ను కోరి సినిమాలో కూడా ఇరగదీసింది. మొన్నటి జై లవ కుశ లో పెద్దగా ప్రాముఖ్యం లేని పాత్రను చేసినా కూడా.. ఒక పాటలో మాత్రం అదరగొట్టింది. అయితే ఈ పిల్ల పోస్టు చేసిన ఫోటో చూస్తే మాత్రం.. అసలు ముఖానికి ఏమైంది అనే సందేహం ఎవరికైనా వస్తుంది. అందుకే నెటిజన్లు దీనిపై తెగ చర్చాఘోష్టిలు నిర్వహించేశారు.
వాస్తవంగా చెప్పాలంటే.. అక్కడ మేకప్ లేకుండా దిగిన ఫోటోకు అమ్మడు ఫోన్లో ఏవో ఫిల్టర్లు ఎప్లయ్ చేయడంతో.. ఆ లుక్ మరింత ఇబ్బందికరంగా తయారైంది. అంతకుమించి నిజంగా నివేథా ముఖానికి ఏమీ అయ్యుండదు అంటున్నారు టెక్నికల్ ఎక్సపర్టులు. అది సంగతి.