కుర్రహీరోయిన్ కోరిక బాగానే ఉందిగా..!

Update: 2021-06-02 08:30 GMT
సినీ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. వారిలో కొందరు యాక్టింగ్ తో పాటు సింగింగ్ - మ్యూజిక్ డైరెక్షన్ - పెయింటింగ్ - ఫోటోగ్రఫీ ఇలా ఒక్కొక్కరు ఒక్కో అదనపు టాలెంట్ బయట పెడుతుంటారు. తాను కూడా అదేబాటలో వెళ్తాను అంటోంది యంగ్ హీరోయిన్ నివేదా థామస్. నివేదా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కుర్రకారు ఫేవరేట్ హీరోయిన్స్ లిస్టులో అమ్మడి పేరు ఖచ్చితంగా ఉంటుంది. అయితే తమిళనాడులో పుట్టిపెరిగిన నివేదా విద్యాభ్యాసం మొత్తం అక్కడే పూర్తిచేసింది. 2016లో 'జెంటిల్ మెన్' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన నివేదా.. ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ అందుకుంది.

మొదటి సినిమా హిట్ అవ్వడంతో అవకాశాలు చేజిక్కించుకొని తనకు సూట్ అయ్యే క్యారెక్టర్స్ మాత్రమే ఎంపిక చేసుకుంటుంది అమ్మడు. ఆ విధంగా నిన్నుకోరి, జైలవకుశ సినిమాలతో పాటు 118, బ్రోచేవారెవరురా, దర్బార్ సినిమాలతో మంచిహిట్స్ ఖాతాలో వేసుకుంది. కానీ ఇప్పటికి సాలిడ్ సినిమాలతో బిజీ హీరోయిన్స్ లిస్టులో మాత్రం చేరలేకపోతుంది నివేదా. గతేడాది నాని, సుధీర్ బాబులతో కలిసి వి సినిమాలో నటించింది. భారీ అంచనాలతో విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించుకుంది. అలాగే అవకాశాలు కూడా పెద్దగా తేలేకపోయింది. ఇటీవలే నివేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ చేసినటువంటి బ్లాక్ బస్టర్ 'వకీల్ సాబ్' సినిమాలో కీలకపాత్ర పోషించింది.

ఏప్రిల్ 9న థియేట్రికల్ రిలీజ్ అయినటువంటి వకీల్ సాబ్ నివేదాకు మంచి పేరు తీసుకొచ్చిందట. వకీల్ సాబ్ మూవీ పై నివేదా చాలా ఆశలే పెట్టుకుందట. కానీ లీడ్ హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం కాదు. ప్రస్తుతం నివేదాకు సోలో హీరోయిన్ గా సాలిడ్ హిట్ అవసరం. అందుకే అమ్మడు మాంచి సూపర్ హిట్ కోసం వెయిట్ చేస్తోంది. అసలే నివేదా గ్లామర్ పరంగా హద్దులు పెట్టుకుంది. మరోవైపు వేరే కుర్రహీరోయిన్స్ గ్లామర్ విషయంలో హద్దులు లేకుండా చెలరేగిపోతున్నారు. ఇలాంటి తరుణంలో నివేదా సర్ప్రైజ్ న్యూస్ చెప్పింది. అమ్మడు హీరోయిన్ గా కాకుండా డైరెక్టర్ కావాలని ఉందంటూ చెప్పి షాకిచ్చింది. ఎందుకంటే నివేదా చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతోంది. అలాగే డైరెక్షన్ కోర్స్ కూడా చేసిందట. అందుకే కొన్నాళ్ళు హీరోయిన్ గా చేసాక షార్ట్ ఫిలిమ్స్ ద్వారా డైరెక్షన్ ప్రూవ్ చేసుకుంటానని అంటోందట. చూడాలి మరి నివేదా డైరెక్టర్ గా ఎప్పుడు అవుతుందో!
Tags:    

Similar News