కరోనా సమయంలో ఒక ఇండియన్ మూవీ అదీ సౌత్ ఇండియన్ మూవీ అవార్డుల పంట పండిచ్చుకోవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. మలయాళ స్టార్ నివిన్ పాలీ హీరోగా నటించిన మూతన్ అనే చిత్రంకు అమెరికన్ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శణకు ఛాన్స్ దక్కింది. దాంతో పాటు అక్కడ ఈ సినిమాకు ఏకంగా మూడు అవార్డులు కూడా దక్కాయి. ఒక సౌత్ మూవీ అక్కడ అంతటి అవార్డులను దక్కించుకోవడం రికార్డుగా చెప్పుకుంటున్నారు.
మూతన్ చిత్రంలో నివిన్ అక్బర్ పాత్రలో నటించి మెప్పించాడు. అద్బుతమైన నటనతో పాటు సినిమాకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. అక్కడ ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటుడు మరియు ఈ చిత్రంలోనే నటించిన బేబీ సంజనాకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు అవార్డు దక్కింది. గత ఏడాది నవంబర్ లో విడుదలైన ఈ చిత్రం కేరళతో పాటు ఉత్తర భారతం మొత్తం మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకోవడంతో మలయాళ సినీ పరిశ్రమ గురించిన చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి శోభిత దూళిపాల్ల నటించడం విశేషం.