త్రిషతో.. నయనతారతో.. ఇద్దరితోనూ..

Update: 2017-07-09 09:05 GMT
మలయాళం  ‘ప్రేమమ్’ సినిమాతో ఒక హీరో ఒక హీరోయిన్ సౌత్ మొత్తం మెచ్చే యువ నటులులలో ఒకరిగా మారిపోయారు. హీరో నివిన్ పౌలీ అప్పటికే చిన్న హీరోగా ఎదుగుతూ ప్రేమమ్ సినిమాతో మలయాళంలో ఒక స్టార్ గా మారాడు. అదే సినిమాలో ఒక హీరోయిన్గా నటించిన సాయి పల్లవి కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ర్టీ అయ్యింది. ప్రేమమ్ హిట్ తో తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించింది ఒక సినిమా ఛాన్స్ కూడా కొట్టేసింది. అయితే హీరో నివిన్ పౌలీ తన స్టార్ ఇమేజ్ తో పక్కనే ఉన్న తమిళ్ ఇండస్ట్రిలో కూడా రంగప్రవేశం చేస్తున్నాడు. మలయాళం సినిమాలో చేస్తూనే తమిళ్లో కూడా హీరోగా నటిస్తున్నాడు. తమిళ్ సినిమా కూడా ఈ చాక్లెట్ బోయ్ ని సాదారంగా ఆహ్వానం పలికింది.

ఈ నవ హీరో తమిళ్ లో చేస్తున్న సినిమాలలో హీరోయిన్లు మాత్రం ఇప్పుడుప్పుడే వస్తున్న నటీమణులు కాదు. తమిళ్ తెలుగు సినిమాలలో స్టార్  హీరోయిన్లుగా వెలుగుతున్న తారలతో జతకట్టనున్నాడు. ఇక్కడ మనం త్రిషను, నయనతారను మామూలు హీరోయిన్లు గానే చూసినా తమిళనాడులో మాత్రం వీళ్ళ ఇద్దరిని  ఇద్దరు టాప్ హీరోలుగా చూస్తారు. అక్కడ నయనతార ఇమేజ్ ఇప్పుడు క్రేజీగా మారింది. ఇలాంటి తారలుతో మన  చిన్న హీరో  నివిన్ సినిమాలు చేయడానికి సిద్దపడుతున్నాడు. త్రిష తో ‘హే జూడ్’ సినిమా నయనతార తో ‘లవ్ యాక్షన్ డ్రామా’ ఒకటి మొదలైంది. వీళ్ళు గత పదేళ్ళు గా టాప్ లో ఉన్న హీరోయిన్లే  కాకపోతే నివిన్ ఇప్పుడుయిప్పుడే స్టార్ అయ్యాడు.  ఈ చిన్న హీరో ఇలా  సీనియర్ భామల వెనుక పడుతున్నాడేంటో. చిన్ననాటి కోరికలు తీర్చుకుంటున్నట్లున్నాడా ఏమి? వాళ్ళ సినిమాలు చూసి వాళ్ళతోనే  యాక్ట్ చేస్తే ఆ కిక్ ఉంటుంది కదా.. అలా అన్నమాట.
​​
ఇలానే తమిళ్ సినిమాలో ఒక హీరోకి జరిగింది. అంటే ఈ ఇద్దరు తో నటించలేదు కానీ వాళ్ళ పేర్లు వాడుకొని.. మ్యూజిక్ డైరక్టర్ జివి ప్రకాష్‌ త్రిష ఇల్లానా నయనతార సినిమా చేశాడు. ఆ కుర్రాడికి పేర్లు మాత్రమే పెట్టుకునే ఛాన్స్ వచ్చింది మరి ఈ మలయాళం నటుడుకి మాత్రం ఇద్దరితో నటించే అవకాశం వచ్చింది. అది సంగతి.
Tags:    

Similar News