భర్తగా 10 కి 10.. నటుడిగా 10 కి 20: నమ్రత

Update: 2019-02-10 07:11 GMT
మహేష్ బాబు ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా అంతకంటే మించి ఒక కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. కొంచెం టైమ్ దొరికినా చాలు వైఫ్ నమ్రత.. పిల్లలు గౌతమ్ సితారలతో సమయం గడిపేందుకు రెడీ అవుతారు మహేష్.  మహేష్ - నమ్రతలు ప్రేమ వివాహం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. నేటితో వారి ప్రేమవివాహానికి 14 ఏళ్ళు.  ఈ సందర్భంగా మహేష్ సతీమణి నమ్రత ఒక ఇంటర్వ్యూలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

తమమధ్య ఎప్పుడు ప్రేమ చిగురించిందో బెబుతూ 'వంశీ' షూటింగ్ సమయంలో షూటింగ్ కోసం న్యూజీల్యాండ్ వెళ్లామని..ఆ సమయంలో తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని తెలిపింది. కానీ అక్కడి నుంచి ఇండియాకు తిరిగి వచ్చేసరికి ఇద్దరం ప్రేమలో ఉన్నామని అర్థం అయిందని చెప్పారు.  "ముందు నేనే మహేష్ కు ఫోన్ చేసి ప్రపోజ్ చేశాను.  అప్పటికే మహేష్ కూడా నన్ను ప్రేమిస్తున్నాడు.  ఒకరి గురించి మరొకరికి అవగాహన ఉంది కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నాం" అంటూ వివరించారు.

పెళ్లి తర్వాత నటించడం తనకే ఇష్టం లేక నటించలేదని అన్నారు.. నటన టేకప్ చేస్తే కెరీర్ కు కుటుంబానికి న్యాయం చేయలేనని అనుకున్నారట. అంతే కాకుండా మహేష్ కూడా వైఫ్ కుటుంబాన్ని చూసుకుంటే బాగుంటుందని అనుకున్నాడట. అందుకే  అప్పటికి కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసి సినిమాలకు దూరం అయ్యానని తెలిపారు.  భర్తగా మహేష్ కు 10 కి 10 మార్కులు వేస్తానని.. అదే నటుడిగా 10 కి 20 మార్కులు వేస్తానని తెలిపారు.  బయట చాలామంది మహేష్ ప్రతి నిర్ణయం వెనక నమ్రత ఉంటుందని అనుకుంటూ ఉంటారు. ఈ విషయం పై స్పందిస్తూ "మహేష్ తీసుకునే నిర్ణయాల్లో నా జోక్యం ఉండదు. తనే సొంత నిర్ణయాలు తీసుకుంటారు. బయట జరుగుతున్న ప్రచారం అబద్దం" అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు నమ్రత.

మరో వైపు గౌతమ్ ఎప్పుడు నటిస్తాడని అడిగితే "ఒకవేళ హీరో అయితే అప్పుడు నటిస్తాడని" చెప్పారు నమ్రత.   గౌతమ్ ను తాము హీరోగా చూడాలనుకుంటున్నామని.. గౌతమ్ కూడా హీరో అవుతానని అంటున్నాడని కానీ ఇప్పుడే ఆ విషయం చెప్పడం తొందరపాటు అవుతుందని.. ఏం జరుగుతుందో చూద్దామని అన్నారు.   
    

Tags:    

Similar News