తమిళ స్టార్ హీరోలు ఒకే మాట..మరి మన హీరోలు??

Update: 2020-05-12 05:15 GMT
థియేటర్లు చాలా రోజుల నుంచి మూతపడడంతో ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు ఆదరణ పెరిగింది.  ఇప్పటికే థియేటర్లు మూసి రెండు నెలలు అవుతోంది.. మరెంతకాలం ఇలా ఉంటుందో తెలియదు.  థియేటర్లు రీ ఓపెన్ చేసిన తర్వాతైనా ప్రేక్షకులు వస్తారా రారా.. కలెక్షన్స్ భారీగానే ఉంటాయా ఉండవా అనే సందేహాలు చాలానే ఉన్నాయి. దీంతో కొందరు డైరెక్ట్ ఒటీటీ రిలీజులకు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయంలో టాలీవుడ్ కంటే కోలీవుడ్ హీరోలకు స్పష్టత ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.

తమిళనాట పెద్ద స్టార్ హీరోలందరూ దాదాపుగా ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ కు నో అని చెప్పారు.  ఇలా చెప్పిన వారిలో విజయ్.. అజిత్.. ధనుష్ లాంటివారు ఉన్నారు. అయితే సూర్య  కొంత భిన్నమైన వాదన వినిపించారు. తను నటించే సినిమాలు పెద్ద బడ్జెట్ కాబట్టి ఓటీటీ రిలీజ్ కు ఒప్పుకోనని.. అయితే తను నిర్మిస్తున్న సినిమాల బడ్జెట్ తక్కువ కాబట్టి వాటిని మాత్రం ఓటీటీలలో రిలీజ్ చేస్తాను అని చెప్పారట.  తమిళంలో దాదాపు అందరు హీరోలు ఈ అంశంపై స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారట.  కానీ టాలీవుడ్ వచ్చేసరికి ఇంకా ఎక్కువమంది హీరోలు అలా చేస్తే ఎమౌతుంది.. ఇలా చేస్తే ఏం జరుగుతుంది అంటూ ఆలోచిస్తూ ఉన్నారట.

ఎక్కువమంది ఈ అంశంపై ఏం మాట్లాడితే ఏం ఇబ్బందో అన్నట్టుగా మౌనంగా ఉన్నారని అంటున్నారు. ఇప్పుడే తమ సినిమాల రిలీజులు లేవు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడడం.. తర్వాత అటూ ఇటూ అయితే మాటను వెనక్కు తీసుకోలేం కదా అనే ఆలోచనతో స్పందించకుండా ఉన్నారని అంటున్నారు. అయితే రిలీజ్ కు సిద్ధంగా ఉన్న 'V'.. 'రెడ్' సినిమాల హీరోలు నాని.. రామ్ మాత్రం ఓటీటీలో డైరెక్ట్ గా విడుదలకు మొగ్గు చూపడం లేదని అంటున్నారు. మరి మిగతా హీరోల అభిప్రాయం ఏంటనేది తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News