టాలీవుడ్ - కోలీవుడ్ - మాలీవుడ్ లోని చాలామంది హీరోలు బాలీవుడ్ లో నటించే అవకాశం దొరికితే అక్కడ పాగా వేసేద్దామని ఆలోచిస్తుంటారు. అయితే, టాలీవుడ్ సూపర్ స్టార్ - ప్రిన్స్ మహేష్ బాబు తనకు బాలీవుడ్ లో నటించే ఉద్దేశం లేదని చాలా సార్లు స్పష్టం చేశాడు. అదే తరహాలో నేచురల్ స్టార్ నాని కూడా బాలీవుడ్ పై తనకున్న ఒపీనియన్ ను ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పాడు. వరుస హిట్లతో కెరీర్ లో పీక్ స్టేజిలో ఉన్న నాని తాను జీవితాంతం తెలుగు సినిమాలే చేస్తానని క్లారిటీ ఇచ్చేశాడు. ఎస్వీ రంగారావు - ప్రకాష్ రాజ్ - నవాజుధ్దీన్ సిద్ధికీ - నానాపటేకర్ ల ఫేస్ వ్యాల్యూ - ఎక్స్ ప్రెషన్స్ ను బట్టి వాళ్లు గొప్పనటులు కాలేదని - వాళ్ల భాష బాగుంటుందని. వాళ్లకు భాష మీదున్న పట్టు వల్ల మంచి నటులయ్యారని నాని అన్నాడు.
తనకు వచ్చిన భాష తెలుగని - తెలుగులోనే బతగ్గలనని చెప్పాడు. తెలుగులో ఓ డైలాగును తాను సొంతం చేసుకొని చెప్పగలనని, ఇంక ఏ భాషలోనూ అలా చెయ్యలేనని అన్నాడు. ఇతర ఇండస్ట్రీలో తనను పరభాషా నటుడిగానే చూస్తారని, మీ దగ్గర ఆయన మంచి యాక్టరా అని వ్యంగ్యంగా మాట్లాడతారేమో అన్నాడు. తనను తెలుగు ప్రేక్షకులు ఎందుకు ఆదరిస్తున్నారో వేరే ఇండస్ట్రీ వాళ్లకు అర్థం కాదని - అందుకే ఆ రిస్క్ తీసుకోలేనని చెప్పాడు. హీరోలు చేసే పనిని మెచ్చినవాడే అభిమాని అవుతాడని - హీరోలు ఏం చెయ్యాలో అభిమానులను అడిగితే అర్థం ఉండదని అన్నాడు. తాను కమల్ హాసన్ అభిమానినని - ఆయన నా దగ్గరకొచ్చి ఏం చెయ్యమంటావో చెప్పమంటే బాగుండదని నాని అభిప్రాయపడ్డాడు. ఆ పద్ధతే సరైంది కాదని, దానిని ఎక్కడో చోట పుల్ స్టాప్ పెట్టాలని అన్నాడు. అంతేకాకుండా, హీరోలు భయపడుతూ వాళ్ల కోసం అది చేశాం - ఇది చేశాం అని చెప్పడం సరికాదన్నాడు.