2.0 కొనేవాళ్లే లేరా!?

Update: 2017-06-29 10:59 GMT
సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో.. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్.. బ్రిటన్ అందాల సుందరి అమీ జాక్సన్.. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శంకర్.. ఇందరి కాంబినేషన్ లో రూపొందిన మూవీని కొనుగోళ్లు చేసేవాళ్లు లేరంటే ఆశ్చర్యం వేయకమానదు. అయితే.. రోబో సీక్వెల్ గా రూపొందిన 2.0 తెలుగు వెర్షన్ కు ఈ సమస్య ఎదురవుతోంది.

తెలుగు 2.0ను హోల్ సేల్ గా అమ్మేయాలన్నది తమిళ నిర్మాతల ఆలోచన. కానీ వాళ్లు చెబుతున్న రేటు చాలా ఎక్కువగా ఉంది. వంద కోట్ల రూపాయలకు పైగా డీల్ అడుగుతున్నారట నిర్మాతలు. తెలుగు వెర్షన్ ను కొనాలంటే.. మనవాళ్లకు అక్కడే సమస్య వస్తోంది. ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ డీల్ అంటే బాహుబలి2. ఆ చిత్రాన్ని 120కోట్లకుపైగా విక్రయించారు. కానీ 2.0 విషయంలో 100 కోట్లు చెప్పడం అంటే.. ఇక్కడి సూపర్ స్టార్స్.. మెగాస్టార్స్ కు మించి కలెక్షన్స్ రాబట్టాలి.

దాదాపు బాహుబలి2 స్థాయిలో ఆడేయాలి అది సాధ్యం కాదని ఫిక్స్ అయిపోయి.. డిస్ట్రిబ్యూషన్ తో సరిపెట్టాలని చూస్తున్నారట. 50-60 కోట్లకు అడ్వాన్స్ మాట్లాడుకుని పంపిణీ చేసేయాలని చూస్తున్నారట మన బడా నిర్మాతలు. ఈ జాబితాలో సాయి కొర్రపాటి టాప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి చివరకు ఈ డీల్ హోల్ సేల్ దగ్గర తెగుతుందో.. డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఆగుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News