గత కొంత కాలంగా వెటరన్ హీరోల స్టామినాపై ఆసక్తికర చర్చ సాగుతోంది. యువతరం హీరోల వెల్లువతో సీన్ రివర్సయ్యింది. హీరోల ఏజ్ ప్రభావం పైనా అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే సినిమాల బిజినెస్ పైనా అది తీవ్ర ప్రభావం చూపుతోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
స్టార్ హీరో బాలకృష్ణ ఇటీవల నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత స్థాయిని అందుకోలేకపోయాయి. ఎన్టీఆర్ బయోపిక్ పరాజయాలు.. అంతకుముందు మసాలా సినిమాల డిజాస్టర్ రిజల్ట్ చూసినదే. ఈ వరుస పరాజయాలతో బాలయ్య మార్కెట్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. దీంతో అతని సినిమా అంటే బయ్యర్స్ ఆచితూచి అడుగులేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం `రూలర్` సన్నివేశం ఇదే. ఇంతకుముందు వచ్చిన టీజర్ ట్రైలర్ ... విజువల్స్ పై విమర్శలొచ్చాయి. పవర్ ఫుల్ టైటిల్ అయితే కుదిరింది కానీ కంటెంట్ లో మాత్రం ఆ పవర్ కనిపించడం లేదన్న విమర్శలు వచ్చాయి.
బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టి మళ్లీ ట్రాక్ లోకి రావాలనుకుంటున్న బాలయ్యకు `రూలర్` బిజినెస్ పెద్ద పరీక్షగా మారుతోందట. వెటరన్ డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ ని ఇటీవలే రిలీజ్ చేశారు. ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. బాలయ్య సినిమా అంటే ఒకప్పుడు బజ్ ఓ రేంజ్ లో వుండేది. కానీ గత కొన్ని సినిమాల నుంచి ఆ బజ్ వినిపిచడం లేదు. దీంతో రూలర్ రైట్స్ కొనాలంటేనే బయ్యర్స్ భయపడుతున్నారట. అసలే ఆర్థిక మాంద్యం నడుస్తున్న వేళ బాలయ్య సినిమా తీసుకుని మరీ ఊబిలో కూరుకుపోవడం ఇష్టం లేదని బయ్యర్లు భావిస్తున్నారని గుసగుసలు వేడెక్కిస్తున్నాయి. బాలయ్య కెరీర్‌లో తను నటించిన సినిమాని కొనడానికి బయ్యర్స్ భయపడి ముందుకు రాకపోవడం అనేది ఆశ్చర్యకరమే. ఆయన ఇకపై ఎంచుకునే కథల పరంగా మరింత జాగ్రత్త పడాల్సిన టైమ్ వచ్చిందన్న విశ్లేషణ సాగుతోంది.