ఇప్పుడు అందరి దృష్టీ ''జనతా గ్యారేజ్'' సినిమా రిలీజ్ పైనే. అప్పట్లో మాత్రం సెప్టెంబర్ 2వ తారీఖున ఆల్ ఇండియా బంద్ కు కొన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన దృష్ట్యా.. అసలు ఈ సినిమా ఆ రోజున ధియేటర్లలోకి వస్తుందా అనే సందేహం వచ్చింది. కాని మొన్న జరిగిన ఆడియో రిలీజ్ నాడు మాత్రం.. ఖచ్చితంగా 2నే సినిమా రిలీజ్ చేస్తున్నాం అంటూ కొరటాల శివ ప్రకటించేశాడు.
ఇదే విషయాన్ని కొందరు పంపిణీదారులు నిర్మాతలను అడగ్గా.. ఆరునూరైనా నూరు నూటపాతికైనా కూడా సినిమాను చెప్పిన డేట్ కే తెస్తామని అన్నారట. అంతేకాదు.. ఎటువంటి సునామీ వచ్చినా కూడా ''జనతా గ్యారేజ్'' రిలీజ్ మాత్రం ఆగే ప్రస్తక్తే లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. ఆగస్టు 25 నాటికి తొలి కాపీ సిద్దమవుతోందని.. వెంటనే సెన్సార్ పనులు పూర్తి చేయించేసి సినిమాను అన్ని ఊళ్ళకూ డిస్పాచ్ చేయాలని భావిస్తున్నారు యునిట్ సభ్యలు. ఒకవేళ బంద్ ప్రభావం మరీ ఉదృతంగా ఉంటుందని అనుకుంటే మాత్రం.. కావాలంటే సినిమా రిలీజ్ ను ముందుకు తీసుకొచ్చి సెప్టెంబర్ 1నే రిలీజ్ చేస్తారట.
చూస్తుంటే జూ.ఎన్టీఆర్ అండ్ కో ఈసారి కంటెంట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని అర్ధమైపోతోంది కదూ. లేకపోతే రిలీజ్ టైమింగ్ గురించి అస్సలు భయపడట్లేదంటే.. దానర్ధం సినిమా ఔట్పుట్ అద్భుతంగా వచ్చిందనేగా.