తెలంగాణలో ‘అజ్ఞాతవాసి’ ఎప్పుడొస్తాడు?

Update: 2018-01-08 08:27 GMT
ఆంధ్రప్రదేశ్ విడుదలయ్యే ప్రతి పెద్ద సినిమాకూ ముందు రోజు అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలు పడతాయి. వీటికి పర్మిషన్లు ఇచ్చే విషయంలో ఎలాంటి అడ్డంకులూ ఉండవు. యుఎస్ జనాలు సినిమా చూసే సమయానికే ఇక్కడి వాళ్లూ చూసేస్తారు.  కానీ తెలంగాణ ప్రాంతంలో మాత్రం బెనిఫిట్ షోల దోపిడీకి అడ్డుకట్ట పడింది. ఇక్కడ ప్రధానంగా హైదరాబాద్‌ లో మాత్రమే స్పెషల్ షోలు వేస్తారు. ఆంధ్రాలో మాదిరి టికెట్ల రేట్లు ఓ మోస్తరుగా ఉండవిక్కడ. వెయ్యి నుంచి మొదలుపెట్టి.. డిమాండును బట్టి రెండు వేలు.. మూడు వేల రేటు కూడా పెట్టి టికెట్లు అమ్ముతారు. క్రమక్రమంగా ఈ దోపిడీ శ్రుతి మించుతుండటంతో హైదరాబాద్ పోలీసులు ఈ షోలకు బ్రేక్ వేసేశారు.

ఏడాది నుంచి హైదరాబాద్‌ లో ఏ సినిమాకూ బెనిఫిట్ షోలు లేవు. ఐతే పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘అజ్ఞాతవాసి’కి మాత్రం బెనిఫిట్ షోలు పడబోతున్నట్లుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడానికి ఇది కూడా ఒక కారణమని ముందు రోజు సెకండ్ షో నుంచే స్పెషల్ స్క్రీనింగ్స్ కోసం అనుమతి ఇవ్వాలని.. అర్ధరాత్రి.. తెల్లవారుజామున కూడా షోలు వేసేందుకు అనుమతి ఇవ్వాలని పవన్ కోరినట్లుగా ఊహాగానాలు వినిపించాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నడూ లేని స్థాయిలో స్పెషల్ షోలు పడతాయని అన్నారు. దీని గురించి గట్టి ప్రచారమే జరగడంతో అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. స్పెషల్ షోలు ఎప్పుడుంటాయి.. బుకింగ్స్ ఎప్పుడు ఓపెనవుతాయి.. సినిమా ఎప్పుడు చూస్తాం అని తెలంగాణ ప్రాంతంలోని పవన్ అభిమానులు ఉత్కంఠతో ఉన్నారు. కానీ విడుదలకు ఇంకొక్క రోజు మాత్రమే గ్యాప్ ఉన్నా ఇంకా ఏ సమాచారం లేదు. ఈ రోజు సాయంత్రానికైనా ఈ విషయంలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News