రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న చిత్రం `విరాట పర్వం`. వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్నారు. సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్ బాబుతో కలిసి నిర్మిస్తున్నారు. కీలక పాత్రల్లో ప్రియమణి, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్, ఈ శ్వరీ రావు, సాయి చంద్, బాలీవుడ్ నటులు నందితా దాస్, జరీనా వాహెబ్ నటిస్తున్నారు.
90వ దశకంలో ఉత్తర తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్నారు. ఆ టైమ్ లో ఉత్తర తెలంగాణ లో జరిగిన నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితురాలైన ఓ యువతి ఎలా ఉద్యమంలోకి వెళ్లింది? .. గ్రామాల్లోని ప్రజలకు వైద్యం అందించాలని ప్రాక్టీస్ మొదలుపెట్టిన డాక్టర్ రవిశంకర్ అలియాస్ రవన్నగా ఎందుకు మారాడు? .. అతని విప్లవ సాహిత్యానికి ఆకర్షితురాలైన వెన్నెల అతన్ని వెతుక్కుంటూ ఎందుకు వెళ్లింది? ఆ తరువాత ఏం జరిగింది? అనే ఆసక్తికరమైన అంశాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
వెన్నెల ఈ ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లెంటీ? అన్నది ఇప్పటికే టీజర్ లో చూపించారు. కామ్రేడ్ రవన్నగా రానా దగ్గుబాటి నటించిన ఈ చిత్రంలో సాయి పల్లవి వెన్నెలగా నటనకు ఆస్కారమున్న పాత్రలో నటించింది. కామ్రేడ్ భారతక్క పాత్రలో ప్రియమణి నటించిన ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. కానీ నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్న నిర్మాత డి. సురేష్ బాబు మాత్రం కొంత షూటింగ్ బ్యాలెన్స్ గా వుందని ప్రస్తుత పరిస్థితుల్లో అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియదని చెప్పారు.
చిత్రీకరణ పూర్తయినా సురేష్ బాబు అలా ఎందుకు చెబుతున్నారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. రిలీజ్ డిలే కావడానికి ప్రధాన కారణంగా చూపించడానికే షూటింగ్ బ్యాలెన్స్ గా వుందని చెబుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా వుంటే న్యూ ఇయర్ సందర్భంగా చిత్ర బృందం శనివారం కొత్త పోస్టర్ ని విడుదల చేసింది. దట్టమైన అడవి అందాల మధ్య సెలయేటి నీలల్లో సేదతీరుతూ పరవశించి పోతున్న సాయి పల్లవి స్టిల్ ఆకట్టుకుంటోంది. ఈ స్టిల్ ని చూసిన వారంతా సెలయేటి నీలల్లో వెన్నెల పరవశం అని కామెంట్ లు చేస్తున్నారు.
అంతే కాకుండా చాలా వరకు పాన్ ఇండియా స్థాయి చిత్రాలు విడుదలవుతున్న వేళ `విరాట పర్వం` మాత్రం రిలీజ్ కి రెడీ కాకపోవడం ఏంటని అంతా ఆరా తీస్తున్నారు. అన్నీ పూర్తయి విడుదలకు మంచి మార్గం ఏర్పడినా చిత్ర బృందం ఎందుకు మూవీని రిలీజ్ చేయడానికి ఇష్టపడటం లేదని, కనీసం ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నామన్నది కూడా వెల్లడించడం లేదని కారణం ఏంటని? ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్ పై చర్చ జరుగుతోంది. శనివారం న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లోనూ మూవీ రిలీజ్ చేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.