కొంత మందికి ఎదురు చూడని అవకాశం తలుపు తట్టినా అది పెద్దగా ఉపయోగపడదు. ఎంత కాలంగా సరైన గుర్తింపు కోసం ఎదురుచూస్తూ ఈ దఫా అది దక్కినట్టే మన దశ తిరిగినట్టే అని భావించినా అది అంతంత మాత్రమే అని తేలిపోతుంది. తనకు దక్కిన అవకాశమని శ్రమించినా ఆ క్రెడిట్ ని మరెవరో కొట్టేస్తుంటారు.. లేదా మరొకరి ఖాతాలోకి వెళ్లిపోతూ వుంటుంది. సరిగ్గా ఇలాంటి అనుభవాన్నే స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైరెక్టర్ సాగర్ కె. చంద్ర ఎదుర్కొంటున్నారా?.. అంటే టాలీవుడ్ లో అవుననే సమాధానం వినిపిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. మలయాళ సూపర్ హిట్ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్'. ఈ చిత్రాన్ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానాల కలయికలో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 25న విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. అంతే కాకుండా ఓ పాటను కూడా రాశారు. సెట్ లో అన్నీ తానై పని చేశారు.
డైరెక్టర్ అన్న పేరు తప్ప అన్ని పనుల్లోనూ త్రివిక్రమ్ ఇన్ వాల్వ్ అయ్యారు. తమన్ విషయంలోనూ త్రివిక్రమ్ పని చేశారు. అసలు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి తెర వెనకుండి అంతా నడిపించింది త్రివిక్రమే.
దీంతో ఈ మూవీ సక్సెస్ క్రెడిట్ సాగర్ చంద్రకు దక్కలేదని తెలుస్తోంది. ప్రతీ విషయంలోనూ త్రివిక్రమ్ ఇన్ వాల్వ్ మెంట్ వుండటంతో ప్రేక్షకులు కూడా దీన్ని త్రివిక్రమ్ సినిమాగానే చూశారే కానీ ఎక్కడా సాగర్ చంద్ర సినిమాగా గుర్తించలేదు.
ఈ సినిమా వల్ల సాగర్ చంద్రకు లభించింది ఏదైనా వుందంటే అది కేవలం దర్శకుడిగా అందిన పారితోషికం మాత్రమే అని చెబుతున్నారు. సాగర్ చంద్ర గురించి తెలిసిన వాళ్లు అతని టాలెంట్ గురించి చెప్పుకొచ్చినా 'భీమ్లానాయక్' తరువాత ఆ స్థాయిలో అవకాశాల్ని మాత్రం అందుకోలేకపోయాడని ఇన్ సైడ్ టాక్. సినిమా విడుదలై మూడు నెలలు కావస్తున్నా ఇప్పటికీ సాగర్ చంద్ర నుంచి కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన రాకపోవడమే ఇందుకు నిదర్శనం అని చెబుతున్నారు.