మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న 150వ సినిమా. అంటే దాని రేంజ్ ఎలా ఉండాలి? అసలు సినిమా రేంజ్ ను పక్కనెట్టండి.. ముందుగా ఆ సినిమా లాంచింగ్ కార్యక్రమం ఎలా ఉండాలి? పైగా ఈయన సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసి చాలా గ్యాప్ తరువాత మళ్లీ తిరిగొస్తున్నారు.. ఇలాంటి సమయంలో ఎంట్రీ అదిరిపోవాలన్నా.. బీభత్సమైన హైప్ రావాలన్నా.. (ఆల్రెడీ మెగాస్టార్ రీ ఎంట్రీకి కావల్సినంత హైప్ ఉందనుకోండి).. ఇనాగురల్ ఫంక్షన్ అదిరిపోవాలి. కాని అక్కడే మనం ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తోంది. మొన్న జరిగిన ఎన్.బి.కె.100 లాంచ్ ఈవెంట్ టైపులో.. గౌతమీపుత్ర శాతకర్ణి ని తెలుగు ప్రేక్షకులకు ఫస్టు లోగో లుక్ తో పరిచయం చేసినట్లు.. చిరంజీవి మాత్రం ఏమీ చేయట్లేదట.
అవును.. కనీసం ఇండస్ర్టీ పెద్దలకు కూడా మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా లాంచ్ కు ఇన్వయిట్ చేయట్లేదని తెలుస్తోంది. అసలు ఇన్విటేషన్లే అచ్చేయలేదట ఇప్పటివరకు. లేదంటే ఈపాటికి పంచేసేవారుగా అంటున్నారు సన్నిహితులు. కేవలం చిరంజీవి కుటుంబ సభ్యలు.. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి హీరోలుగు టాప్ లేపేస్తున్న ఆ టాప్ స్టార్లు.. ఈ కార్యక్రమానికి వస్తారట. మన ఫ్యామిలీలోనే ఇంతమంది సెలబ్రిటీలు ఉండగా.. మనకెందుకులే గెస్టులు అనుకున్నారంటారా? అబ్బే అలా అనుకుని ఉండరులే కాని.. కంటెంట్ తో చూసుకుందాం.. ఈ హైపు పార్టీలు మనకెందుకులే అనుకున్నారేమో మన మెగాస్టార్. సర్లేండి.. మరి బాలయ్య 100కి ఈయన చీఫ్ గెస్టుగా వెళ్లారు కాబట్టి.. రివర్సులో ఆయన్ను పిలిస్తే బాగుంటుంది. ఇది కేవలం ఒక సలహా మాత్రమే సుమీ!!