కామ్రేడ్ కష్టాలకు నో ఫుల్ స్టాప్

Update: 2019-08-03 06:00 GMT
విడుదలై వారం దాటకుండానే పావు గంట సినిమా ట్రిమ్ చేయడం ముందు వద్దనుకున్న పాటను జోడించడం లాంటి ట్రిక్కులేవి డియర్ కామ్రేడ్ ను కాపాడలేకపోతున్నాయి. వసూళ్లలో ఏ మాత్రం మెరుగుదల లేక నష్టాలు ఖాయమని  బయ్యర్లు కంక్లూజన్ కు వచ్చేశారు. ఈ  వీకెండ్ రెండు రోజులు అద్భుతాలు ఏమి జరగకపోవచ్చనే చర్చ జోరుగా నడుస్తోంది. యుఎస్ లో పది రోజులు తర్వాత మిలియన్ మార్క్ చేరుకున్నట్టు నిర్మాతలు పోస్టర్లు వదులుతున్నారు కానీ వాటిలో విశ్వసనీయత గురించి ట్రేడ్ సర్కిల్స్ లో అనుమానాలు లేకపోలేదు.

ఎన్ని ఆఫర్లు ఇచ్చినా టికెట్లు వన్ ప్లస్ వన్ అన్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్న కామెంట్స్ ఉన్నాయి. ఒకవేళ చెప్పుకుంటున్న వసూళ్లు  నిజమైతే డియర్ కామ్రేడ్ చాలా ముందుగానే మిలియన్ టచ్ చేసేది. కానీ జరగలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. నిన్న రిలీజైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రాక్షసుడుకి థ్రిల్లర్ లవర్స్ నుంచి యునానిమస్ గా పాజిటివ్ టాక్ రావడం రిపోర్ట్స్ బాగుండటంతో వర్క్ అవుట్ అయ్యేలా కనిపిస్తోంది.

సరిగా బాలన్స్ చేయలేకపోయినా అంతో ఇంతో మాస్ కు  కనెక్ట్ అయ్యే అంశాలు కొన్ని ఉన్న గుణ 369 కూడా బిసి సెంటర్స్ లో సేఫ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదనే మాట వినిపిస్తోంది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పుడీ పరిణామం కామ్రేడ్ ను దెబ్బ కొట్టేదే. 34 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ చేసుకున్న కామ్రేడ్ ఇంకో పది కోట్లకు పైగా వెనుకబడి ఉన్నాడు. అంత షేర్ రావడం అంటే మాటలు కాదు. సో ఫైనల్ రన్ వచ్చేలోపు ఎంత శాతం నష్టం తగ్గుతుందని ఎదురు చూడటం తప్ప కామ్రేడ్ కు ఇంకే ఆప్షన్ మిగల్లేదు


Tags:    

Similar News