తెలుగు రాష్ట్రాల్లో `గులాబ్` తుఫాన్ దెబ్బ మామూలుగా లేదు. గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలతో అల్లల్లాడుతున్నారు జనం. పల్లె..పట్టణం అన్నీ నీట నిండా మునిగాయి. దీంతో ప్రభుత్వాలు హుటాహుటిన స్కూళ్లు.. కాలేజీలకు సెలవులు ప్రకటించాయి. ఇళ్లు దాటి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసాయి. అయినా డోంట్ కేర్ అంటూ తుఫాన్ ని సైతం పక్కనబెట్టి `లవ్ స్టోరీ` ఫ్యాన్స్ థియేటర్ల వైపు తరలుతున్నారు. తుఫాన్ దెబ్బని సైతం తట్టుకుని లవ్ స్టోరీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఇప్పటికే 50 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మూడు రోజుల్లోనే 15 కోట్ల షేర్ ని సాధించింది.
సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ `లవ్ స్టోరీ` ఊపు మాత్రం మూములుగా లేదు. ముందుగా ఆడియో పెద్ద హిట్ అవ్వడం... నాగచైతన్య లవర్ బోయ్ ఇమేజ్..సాయి పల్లవికి యూత్ లో ఉన్న క్రేజ్ అన్ని సినిమాకు అదనపు బలంగా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద పోటీ కూడా లేకపోవడం వంటి అంశాలు సినిమాకు బాగా కలిసొచ్చాయి. ఇక `గులాబ్` నేపథ్యంలో సెలవులు ప్రకటించడం తో `లవ్ స్టోరీ`కి తాజాగా కలిసొస్తుందని తెలుస్తోంది. దూరపు ప్రాంతాల వారు థియేటర్ వరకూ వెళ్లకపోయినా ..స్థానికలతోనే థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. స్టూడెంట్స్ కి సెలవులు కూడా రావడంతో దూరమైనా రిస్క్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.
సింగిల్ స్క్రీన్ లో 70 రూపాయల టిక్కెట్ బ్లాక్ మార్కెట్ లో 200రూపాలయకు అమ్మడుపోతుందంటే? లవ్ స్టోరీ ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఓవరాల్ గా `లవ్ స్టోరీ` కరోనా థర్డ్ వేవ్ ముందు ధైర్యంగా ముందుకొచ్చి సక్సెస్ అయింది. మరిన్ని రిలీజ్ లకు లైన్ క్లియర్ చేసింది. ఫలితాలు ఎలా ఉంటాయి? అని కమ్ములా-చైతన్య కాస్త కంగారుపడినా సంతృప్తినిచ్చే ఫలితమే వచ్చింది. చై సెటిల్డ్ పెర్పామెన్స్ తో తనలో సంపూర్ణ నటుడిని ఆవిష్కరించినట్లు అయింది. గులాబ్ సీజన్ లో గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది.