జోష్ లేదేంటి కళ్యాణ్

Update: 2019-03-03 04:22 GMT
మొన్న శుక్రవారం విడుదలైన కళ్యాణ్ రామ్ కొత్త సినిమా 118 డివైడ్ టాక్ తో పాటు వసూళ్ల పరంగా మరీ ఆశించిన స్థాయిలో ఫలితాలు చూపించలేకపోవడం నందమూరి అభిమానులను ఖంగారు పెడుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ గాయాలకు కొంతైనా ఇది స్వాంతన చేకూరుస్తుందన్న నమ్మకంతో ఉన్న వాళ్ళ ఆశలు నెరవేరడం కష్టమే అనిపిస్తోంది. మొదటి రోజు కోటిన్నర లోపు షేర్ తో  ఓ మోస్తరుగా పర్వాలేదు అనిపించుకున్న 118 సెకండ్ డే నుంచే డ్రాప్ చూపిస్తోంది.

వీకెండ్ కాబట్టి ఈ రోజు మేనేజ్ చేసినా రేపటి నుంచి అగ్ని పరీక్ష తప్పదని ట్రేడ్ మాట. ఫస్ట్ హాఫ్ ఓ మాదిరిగా మెప్పించినా సెకండ్ హాఫ్ లో  జరిగిన డ్యామేజ్ కి కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతోంది. ఇదిలాగే కొనసాగితే కళ్యాణ్ రామ్ కోరుకున్న సక్సెస్ ఈసారి కూడా దక్కనట్టే. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమంత పోటీ లేదు. అజిత్ విశ్వాసం ఉన్నప్పటికీ అది యాభై రోజుల క్రితం వచ్చిన తమిళ సినిమా కావడం ఇప్పటికే ఆన్ లైన్ లో దీని ఒరిజినల్ ప్రింట్ అందుబాటులో ఉండటం లాంటి కారణాలు వచ్చే అరకొరా వసూళ్ళకు సైతం కోత వేస్తోంది.

ఇది తప్పించి ఇతరత్రా చిన్న సినిమాలను ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు. అయినా కూడా 118 డీసెంట్ ఫిగర్స్ రాబట్టుకోవడానికి కష్టపడటం చూస్తే థ్రిల్లర్ జానర్ లో రిస్క్ చేసిన కళ్యాణ్ రామ్ కు ఇంకో పరీక్షకు సిద్ధం కావాలి అనిపించేలా ఉంది. గుహన్ దర్శకత్వం కన్నా ఛాయాగ్రహణం ఎక్కువ మార్కులు కొట్టేయడం గమనార్హం. ఇంకో రెండు మూడు రోజులు వసూళ్లు చూసాక రేపు ఎల్లుండి నమోదయ్యే డ్రాప్ ని బట్టి 118 ఫైనల్ స్టేటస్ డిసైడ్ అయిపోతుంది
Tags:    

Similar News