ఇటీవలే వచ్చిన ఎన్జికెతో పెద్ద షాకే తిన్న సూర్య వచ్చే నెలాఖరున విడుదల కానున్న బందోబస్త్(తమిళ్ కాప్పన్) మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. మాతృభాషలో తప్ప ఇతర రాష్ట్రాల్లో తన మార్కెట్ బాగా దెబ్బ తిన్న తరుణంలో దీంతో హిట్టు కొట్టి మళ్ళీ లైఫ్ పొందాలని ఎదురు చూస్తున్నాడు. అనవసరమైన హడావిడి వల్లే తన సినిమాల మీద అంచనాలు పెరిగిపోయి నెగటివ్ రెస్పాన్స్ ఎక్కువ వస్తోందని గుర్తించిన సూర్య తన కొత్త సినిమా సూరారై పోట్రు ని సైలెంట్ గా కానిచ్చేస్తున్నాడు.
తెలుగులో గురు రీమేక్ ని వెంకటేష్ తో చేసి పేరు తెచ్చుకున్న మహిళా దర్శకురాలు సుధా కొంగర దీనికి డైరెక్టర్ కావడం విశేషం. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ కెప్టెన్ గోపి నాధ్ బయోపిక్ ఆధారంగా ఇది రూపొందుతోంది. ప్రస్తుతం మీడియాకు ఎక్కువ లీక్స్ ఇవ్వకుండా దీని షూటింగ్ చేసేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉంది. తమిళ్ తెలుగులో ఆ టైంలో విపరీతమైన పోటీ ఉండటంతో ఇంకా నిర్ధారణకు రాలేదు.
అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో పరేష్ రావల్ - జాకీ ష్రాఫ్ - సెంథిల్ కుమార్ లతో పాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ కీలక పాత్ర చేస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో టీమ్ ఉంది. ఇప్పటిదాకా చూడని పాత్రలో సూర్య లుక్ చాలా షాకింగ్ గా ఉంటుందట. గురు తర్వాత మూడేళ్ళ గ్యాప్ తీసుకుని సుధా కొంగర చేస్తున్న మూవీ ఇదే. తను చెప్పిన నెరేషన్ విపరీతంగా నచ్చడంతో సూర్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఫిలిం నగర్ టాక్