ఎల్లుండ బాక్సాఫీస్ ఎలాగో కొత్త సినిమాలతో నిండుతుంది. శుక్రవారం అంటేనే ఇక్కడ పండగ. అయితే ఈ శుక్రవారం వచ్చే రెండు సినిమాల గురించీ అసలు హైప్ లేకుండా పోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. నాని హీరోగా రూపొందిన ''నిన్ను కోరి'' సినిమా.. అలాగే శ్రీదేవి ''మామ్'' ఈ శుక్రవారం రాబోతున్నాయి. వీటిలో నిన్ను కోరి సినిమాకు ఖచ్చితంగా చాలా హైప్ ఉండాలి. కాని ఇప్పటివరకు లో-పబ్లిసిటీ అనండీ లేదంటే అనుకున్నంత బజ్ రాలేదనే అనండి.. నాని సినిమాకు రావల్సినంత హైప్ మాత్రం అస్సలు రాలేదు.
మామూలుగా బి.సి సెంటర్లలో సినిమా ఎక్కాలంటే.. హీరోయిన్లు కాస్తన్నా ఎట్రాక్ట్ చేయాలి. గతంలో నేను లోకల్ సినిమాలో కీర్తి సురేష్ నాటీ చూపులతో పడేస్తే.. అంతకంటే ముందు మజ్నూ సినిమాలో అనూ ఎమ్యానుయేల్ తన ఓరచూపులతో కవ్వించేసింది. కాని 'నిన్ను కోరి' సినిమాలో నివేథా థామస్ మాత్రం ఎందుకో అలాంటి మాయను టీజర్ల ద్వారా అస్సలు చేయలేకపోయింది. ఇకపోతే గత నాని సినిమాలన్నింటిలోనూ కామన్ మ్యాన్ పాడుకునే విధంగా చాలా పాటలే ఉన్నాయి కాని.. ఈ 'నిన్ను కోరి' మరీ పూర్తి స్థాయి మెలోడీలు కావడం వలన.. నార్మల్ ప్రేక్షకులు ఎవ్వరూ పెద్దగా కనక్టవ్వలేదని టాక్.
ఇవన్నీ పక్కనెట్టేస్తే.. ఎప్పుడూ చక్కగా నవ్విస్తూ అలరించే నాని.. ఇప్పుడు మరోసారి సీరియస్ గా బాధపడే క్యారక్టర్ చేయడం కూడా హైప్ మీద నెగెటివ్ గా పనిచేస్తోందేమోనని ఒక ఊహ. ఎందుకంటే గతంలో నాని కొన్ని సినిమాల్లో ఇలాంటి బాధాకరమైన ప్రయోగాలు చేసినప్పుడు.. జనాలు బాగా హర్ట్ అయ్యారు. ఏదేమైనా కూడా.. రిలీజ్ రోజున సినిమాలోని కంటెంట్ బట్టి వచ్చే టాక్ తో నాని 'నిన్ను కోరి' హైప్ ఏమన్నా మూటకట్టుకోవాలి. ప్రస్తుతానికైతే భారీ ఓపెనింగ్స్ వచ్చే రీతిలో అక్కడ సీన్ కనబడట్లేదని ట్రేడ్ పండితుల అంచనా వేస్తున్నారు.