సైఫ్అలీఖాన్ వారసురాలిగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన సారా అలీఖాన్ వరుసగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కేధరనాథ్, సింబా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకున్న భామ ఇటీవలే లవ్ ఆజ్ కల్ చిత్రీకరణ పూర్తిచేసింది. కూలీ నెంబర్ 1 టీమ్ తో జాయిన్ అయింది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది. అయితే సారా లవ్ ఆజ్ కల్ హీరో కార్తిక్ ఆర్యన్ తో డేటింగ్ లో ఉందని బాలీవుడ్ మీడియా కథనాలు వెడెక్కిస్తున్నాయి.
ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. చిత్రీకరణ పూర్తయిన తర్వాత వాళ్లిద్దరి రిలేషన్ మరింత బలపడిన ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ కథనాలపై సారా స్పందించింది. కార్తిక్ తో డేటింగ్ లో లేనని. కార్తిక్ ని వేవలం సెట్స్ లో మాత్రమే కలిసేదాన్ని అని తెలిపింది. ఇద్దరం కలిసి బయటకు వెళ్లింది కూడా లేదు.ఒకవేళ అలాంటి ఆధారాలు ఏవైనా ఉంటే చూపించండి అంటూ సవాల్ విసిరింది.
మేము కలిసి తిరిగినట్లు ఫోటోలు సంపాదించాలంటే ఇద్దరం కలిసి సినిమా చేసినప్పుడు మాత్రమే సాధ్యపడుతుందని...అప్పటివరకూ ఆ ఛాన్స్ లేదంటూ నవ్వేసింది.బయటకి ఒకలా..లోపల మరోలా ఉండటం నాకు తెలియదంది. అదీ ఎఫైర్...ప్రేమ లాంటి విషయాలు అస్సలు దాచి పెట్టనంది. ఆ క్షణం వస్తే నేనే చెబుతానంటూ క్లారటీ ఇచ్చేసింది. ఇంత వివరణ ఇచ్చిన నాపై రూమర్లు ఆగుతాయి? అనుకోవడం లేదు. అయినా వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతానని తెలిపింది.