సెన్సార్ కి ఇంటర్ కోర్స్ నచ్చలేదు

Update: 2017-06-24 05:22 GMT
సెన్సార్ రూల్స్ భలే ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్తకొత్తగా ప్రయత్నిస్తూ ఉంటారు. సహజంగా కాలంతో పాటు అప్డేట్ అవుతుండడం సంతోషించాల్సిన విషయమే. కానీ సెన్సారు వారు మాత్రం ఈ విషయంలో ఉన్నకొద్దీ వెనక్కు వెళుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది.

సెన్సార్ నిర్ణయాలు పలు మార్లు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంటాయి. తాజాగా షారూక్ ఖాన్ మూవీ 'జబ్ హారీ సేజల్' మిని ట్రైలర్స్ విడుదుల చేస్తున్నాడు. వీటిలో ఒకదానిలో షారూక్ ఇంటర్ కోర్స్ అనే పదం ఉపయోగించారు. కానీ షారూక్ మూవీలో అనుష్క శర్మ ఆ పదాన్ని ఉపయోగించిన తీరు ఏ మాత్రం అసభ్యంగా ఉండదు. ఇద్దరు పెద్దవాళ్లు మాట్లాడుకుంటున్నపుడు కేజువల్ గా ఉపయోగించినట్లు మాత్రమే ఉంటుంది. ఇలాంటి డిస్కషన్స్ లో ఇంతకంటే ఉన్నతంగా చెప్పేందుకు వేరే పదం కూడా లేదేమో. అయినా సరే సెన్సార్ వాళ్లకు ఇంటర్ కోర్స్ నచ్చలేదు.

అందుకే ఇంటర్ కోర్స్ అనే పదాన్ని తొలగించాలంటూ షారూక్ ఖాన్ కి హుకుం జారీ చేశారు. అయితే.. ఇంటర్నెట్ పై వీరికి ఎలాంటి నియంత్రణలు లేవు కాబట్టి.. అక్కడి వరకూ వదిలేసి థియేట్రికల్.. టెలివిజన్ లలో ఇచ్చే ట్రైలర్స్.. మూవీల్లో మాత్రం ఇంటర్ కోర్స్ అనే పదం ఉపయోగించకూడదని తేల్చేశారు. దీనికి జబ్ హారీ మెట్ సేజల్ యూనిట్ రియాక్షన్ ఏంటో ఇంకా తెలియలేదు కానీ.. సెన్సార్ వారి తీరు మాత్రం ఆక్షేపణీయమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News