అందుకే యాత్రలో జగన్ పాత్ర లేదు!

Update: 2018-10-30 05:37 GMT
తెలుగులో ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తోంది. అదే కోవలో తెరకెక్కుతున్న చిత్రం 'యాత్ర'.  ఉమ్మడి ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి-తెలుగు రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమాను మహి వీ. రాఘవ్ రూపొందిస్తున్నాడు. ఈ సినిమా గురించి తాజాగా ఒక అప్ డేట్ బయటకు వచ్చింది.

అందరూ అనుకుంటున్నట్టుగా ఈ సినిమాలో వైయస్సార్ తనయుడైన జగన్ మోహన్ రెడ్డి పాత్ర లేదట.  ఇతర బయోపిక్ లకు భిన్నంగా 'యాత్ర' వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర ఎపిసోడ్ ప్రధాన ఘట్టంగా సాగుతుంది.  వైఎస్ పాదయాత్ర చేపట్టే ముందు ఏం జరిగింది.  యాత్రలో అయన ప్రజలతో ఎలా మమేకమయ్యారు.. ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిష్టించేందుకు యాత్ర ఎలా తోడ్పడింది ఇలా ఒక ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామా లాగా ఉంటుంది.  దీంతో దర్శకుడు మహి.. 'యాత్ర' టీమ్ వారు ఈ సినిమాకు జగన్ పాత్ర అవసరం లేదనే నిర్ణయానికి వచ్చారట. జగన్ పాత్ర ఉంచితే సినిమా థీమ్ నుండి పక్కకు జరిగినట్టు అవుతుందని భావించి జగన్ పాత్ర లేకుండానే 'యాత్ర' సినిమా ఉండేలా నిర్ణయం తీసుకున్నారట.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో వైయస్సార్ పాత్రలో నటిస్తున్న మలయాళ స్టార్ హీరో మమ్ముట్టికి ఇతర స్టార్ హీరోలకు తండ్రి పాత్రలో నటించడం ఇష్టం లేదని.. జగన్ పాత్రను పక్కనపెట్టడానికి ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News