సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మూవీ `సర్కారు వారి పాట`. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నఈ మూవీ హంగామా ట్రైలర్ రిలీజ్ తో మొదలైంది. రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్నిఈ మూవీ ప్రమోషన్స్ ని టీమ్ పీక్స్ కి తీసుకెళుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాకు సాలీడ్ బజ్ ని క్రియేట్ చేయడంతో ఖుషీలో వున్న టీమ్ ప్రమోషన్స్ జోరు ని పెంచేసింది. ఈ సందర్భంగా ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న హీరోయిన్ కీర్తిసురేష్ తో ముందు ప్రమోషనల్ కార్యకర్రమాలని చిత్ర బృందం మొదలు పెట్టింది.
వరుసగా కీర్తీ సురేష్ చేత వీడియో ఇంటర్వ్యూలు ప్లాన్ చేసిన మేకర్స్ ఆ తరువాత డైరెక్టర్ ని కూడా రంగంలోకి దింపేశారు. కీర్తి, పరశురామ్ బ్యాక్ టు బ్యాక్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ సినిమాకు సంబందించిన పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. ఇక శుక్రవారం సోలోగా మీడియా ముందుకొచ్చిన దర్శకుడు పరశురామ్ మరిన్ని ఆసక్తికర విశేషాలని మీడియాతో పంచుకున్నారు.
అయితే ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు. `సర్కారు వారి పాట` భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై సంధిస్తున్న వ్యంగ్యాస్త్రం అని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. అలాగే దీనిపై సందేశాత్మకంగా ఈ సినిమా వుంటుదని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై దర్శకుడు పరశురామ్ క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఎలాంటి సందేశం ఇవ్వడం లేదని, బ్యాంకింగ్ వ్యవస్థ గురించి చెబుతున్నాం. కానీ సెటైర్లు వేయడం లేదని, సినిమా అంతా దానిపైనే వుండదని, ఎంటర్ టైన్ మెంట్ తో సాగుతుందని చెప్పుకొచ్చారు.
ఇదొక కమర్షియల్ సినిమా అని స్పష్టం చేశారు. మహేష్ క్యారెక్టర్ తో ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అవుతారని, ఆయన పాత్ర అంతగా ప్రభావం చూపిస్తుందని చెప్పుకొచ్చారు. `గీత గోవిందం`లో బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ని అందించిన గోపీ సుందర్‌ని కాదని తమన్ ని ఎందుకు తీసుకున్నారనే విషయాన్ని కూడా వెల్లడించారు. గోపీ సుందర్ ని తీసుకోవాలని అనుకున్నా తనే ఆ సమయంలో బిజీగా వుండటం వల్ల తమన్ ని తీసుకున్నామన్నారు. రెండేళ్ల క్రితం ఈ కథ అనుకున్నప్పుడే కీర్తి సురేష్ హీరోయిన్ అనుకున్నానని, సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ ఈ పాత్రకు ఆమెనే పర్ఫెక్ట్ అంటారన్నాడు.
దర్శకుడు పరశురామ్ చెప్పినట్టుగా `సర్కారు వారి పాట`లో మహేష్ ఎవరికీ ఎలాంటి క్లాస్ లు ఇవ్వడం లేదని స్పష్టమైంది. సింపుల్ గా చెప్పాలంటే మహేష్ మార్కు ఎంటర్ టైన్ మెంట్ తో సాగే మాసీవ్ ఎంటర్ టైనర్. ట్రైలర్ తోనే ఇది ప్రూవ్ అయిపోయింది. బ్యాంకులకు డబ్బులు ఎగవేసిన వారి భరతం పట్టే వ్యక్తిగా ఇందులో హీరో మహేష్ కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది.
సముద్రఖని, మహేష్ ల మధ్య వచ్చే సన్నివేశాలే ఇందుకు ఉదాహరణగా కనిపిస్తున్నాయి. ఈ నెల 12న భారీ స్థాయిలో విడుదల కానున్న `సర్కారు వారి పాట` బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో వసూళ్ల పాట పాడటం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అదే మాట నిజమవుతుందా లేదా అన్నది తెలియాలంటే ఈ నెల 12 వరకు వేచి చూడాల్సిందే.