మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) లుకలుకలు అంతకంతకు వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 2020 మా డైరీ ఆవిష్కరణ వేదికపై మీడియా ముఖంగానే ఈ విషయం మరోసారి బయట పడింది. మా అధ్యక్షుడు నరేష్ తో ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు రాజశేఖర్ విభేధించడం అటు పై పెద్దలు సర్ధి చెప్పే ప్రయత్నం చేయడం హాట్ టాపిక్ గా మారింది. `మా` డైరీ ఆవిష్కరణ లో రాజశేఖర్ ఎమోషనల్ గా మాట్లాడి అంతర్గత వ్యవహారాల పై బయట పడిపోవడం వేదిక పై పెద్దలెవరికీ నచ్చలేదు. మీడియా ముందు అలుసైపోతున్నామని వారించినా .. రాజశేఖర్ తగ్గక పోవడం ఎవరికీ రుచించలేదు. దాంతో వెంటనే మెగాస్టార్ చిరంజీవి - కృష్ణం రాజు ఆయన పై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా కమిటీని కోరారు.
అయితే ఈ వివాదాన్ని కొన్ని మీడియాలు చిరంజీవి వర్సెస్ రాజశేఖర్ అంటూ ప్రచారం చేసేశాయి. చిరుతో రాజశేఖర్ కి వ్యక్తిగత విభేధాలున్నాయని .. మా డైరీ ఆవిష్కరణ వేదిక పై జరిగింది ఇదేనని ప్రచారం చేసేశారు. అయితే ఇది వాస్తవమా? చిరుతో రాజశేఖర్ పర్సనల్ గా విభేధిస్తున్నారా? అందుకే ఇలా బయట పడ్డారా? అంటే అలాంటిదేమీ లేదని సామాజిక మాధ్యమాల ద్వారా రాజశేఖర్ వివరణ ఇచ్చారు. తనకు సినీ పెద్దలెవరితోనూ విభేధాలు లేవని.. ముఖ్యంగా చిరంజీవి తో విభేధాలు లేవని తెలిపారు. తనకు కేవలం మా అధ్యక్షుడు నరేష్ తో మాత్రమే విభేధాలు ఉన్నాయని వివరణ ఇచ్చారు.
దీనిని పర్సనల్ ఫైట్ గా భావించ వద్దని రాజశేఖర్ అభ్యర్థించారు. చిరు-మోహన్ బాబు వంటి వారితో తనకు ఏ విభేధాలు లేవని తెలిపారు. అలాగే పెద్దలు ఉన్న సభకు తనవల్ల అమర్యాద కలిగినందుకు క్షమాపణలు చెప్పారు. ఇక ఈ వివాదం తర్వాత రాజశేఖర్ `మా`లో తన పదవికి రాజీనామాను సమర్పించిన సంగతి తెలిసిందే.