ఓటీటీలు అంటేనే విచ్చలవిడి ప్రసారాలకు మారుపేరుగా నిలిచిపోయాయి. ఓటీటీల్లో సెన్సార్ లేకపోవడంతో దర్శకనిర్మాతలు రెచ్చిపోయి వెబ్‌సీరిస్‌లను తెరకెక్కిస్తున్నారు. ఓటీటీలో అద్భుతమైన వెబ్‌సీరీస్‌లు ఎన్నో వచ్చాయి.. ఇది కాదనలేని సత్యం.. అదేవిధంగా బూతు కంటెంట్ కూడా పెరిగిపోయింది. ఇది యువతను పెడదోవ పట్టిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. త్వరలో ఓటీటీపై కూడా సెన్సార్ పెట్టాలని చూస్తున్నది. ఓటీటీలను కేంద్ర సమాచారశాఖ కిందకు తెచ్చి త్వరలోనే సెన్సార్ నిబంధనలను తీసుకురానున్నారు. ప్రస్తుతం డిజిటల్ యుగం సాగుతున్నది. టీవీలో వస్తున్న వినోద కార్యక్రమాలు, సీరియళ్లు చూసి ప్రేక్షకులకు విసుగెత్తింది. అందుకే యువత ఇప్పుడు ఓటీటీ వెంట పడుతున్నది. ఇంతకాలం ఏ ఆప్షన్ లేకపోవడం వల్ల యువత చచ్చినట్టు టీవీలో వచ్చిన ప్రోగ్రామ్స్ చూసేవారు. చానళ్లు మారుస్తూ ఏదో ఓ చానళ్లలో కుదురుకుపోయేవారు. ఉన్నదాంట్లో బెటర్ ఎంపికచేసుకొని చూసేవారు.
కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. యువత వినోదం కోసం ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. అందులో ఉండే వెబ్‌సీరీస్‌లు వాళ్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో టీవీల ముందు అతుక్కుపోకుండా ఓటీటీల వెంట పడుతున్నారు. ఓటీటీ సంస్థలు కూడా యువత అభిరుచిగా తగ్గట్టుగానే కంటెంట్‌ను తయారుచేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో కొన్ని వెబ్ సీరీస్లలో శృంగారం శృతి మించుతోంది. బూతు పదాలు పెరిగిపోతున్నాయి. సెన్సార్ చిక్కు లేకపోవడంతో రచయితలు, డైరెక్టర్లు కూడా చెలరేగిపోతున్నారు. తమ క్రియేటివిటీకి పదునుపెడుతున్నారు. దీంతో యువత పెడధోరణికి వెళ్లిపోతున్నారు. ఓటీటీలో నేర సంస్కృతి, బూతు పదాలు, శృంగారసన్నివేశాలకు అడ్డు అదుపులేకుండా పోయింది. ఈ విషయంపై చాలాకాలంగా విమర్శలు వస్తున్నాయి. ఓటీటీపై కూడా సెన్సార్ ఉండాలని కొందరు వాదిస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, హంగామా, వూట్, ఎంఎక్స్ ప్లేయర్ సహా మనదేశంలో దాదాపు 40 దాకా ఓవర్ ద టాప్ (ఓటీటీ) లు ఉన్నాయి. తెలుగులో ‘ఆహా’ అనే యాప్ ఉన్నది.
అయితే శశాంక్ శేఖర్ ఝూ అనే ఓ లాయర్ ఓటీటీల విశృంఖలత్వంపై ఇటీవల సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. ఓటీటీలపై సెన్సార్ ఉండాలని.. ఇందుకోసం ఓ స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని అతడు కోర్టుకు విన్నవించుకున్నాడు. ఈ విషయంపై సుప్రీంకోర్టు కూడా స్పందించింది. ఓటీటీలో సెన్సార్ ఉండాలన్న విషయంపై కేంద్ర వైఖరి ఏమిటో చెప్పాలని సుప్రీం ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఓటీటీలను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ మేరకు సర్కార్ ఇచ్చిన గెజిట్‌కు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
కేబుల్ టీవీ నియంత్రణ చట్టం 1995లో టీవీల్లో ఎటువంటి కార్యక్రమాలు ప్రసారం చేయాలనే విషయంపై నిబంధనలు ఉన్నాయి. దాన్ని బట్టి ఓటీటీల్లో ప్రసారం చేయాల్సిన కార్యక్రమాలు, కంటెంట్‌కు సంబంధించి కొన్ని నిబంధనలు పెట్టే అవకావం ఉన్నది. అయితే ప్రభుత్వం తీసుకొచ్చే ఈ విధానాన్ని పలువురు దర్శకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇలా చేయడం భావ ప్రకటనాస్వేచ్ఛను హరించడమేనని వారు వాదిస్తున్నారు. దీనిపై తాము కూడా కోర్టుకు వెళతామని చెబుతున్నారు. ప్రముఖ దర్శకుడు అంక్రితా శ్రీ వాత్సవ్ ఈ విషయంపై స్పందిస్తూ అసలు సెన్సార్ ఉండటమే ఓ తప్పుడు విధానం. అది ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటిది. సెన్సార్‌నే తీసేయాలని మేము డిమాండ్ చేస్తుంటూ ఇప్పుడు ఓటీటీలపై సెన్సార్ పెట్టడం దారుణమైన విషయమని ఆయన పేర్కొన్నారు.