ఆ డైలాగులు తీసేస్తారా? లేదా?

Update: 2017-10-20 10:22 GMT
విషయం ఏంటంటే.. తమిళనాట సినిమాలన్నీ ఇప్పుడు రాజకీయ చెక్కర్లే కొడుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఏ హీరో చూసినా ఏదో ఒక విధంగా రాజకీయాలతో ఆనుంబంధం మెయిన్టయిన్ చేస్తున్నారు. ఇప్పుడు పవర్ ఫుల్ హీరో విజయ్ కూడా.. సాధారణంగా రాజకీయాలను దూరంగానే ఉంచుతాడు కాని.. ఇప్పుడు మాత్రం 'మెర్సాల్' సినిమాలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆడుకున్నాడు.

కార్పొరేట్ మెడికల్ వ్యవస్థపై మెర్సాల్ సినిమాలో పోరాటం చేస్తాడు విజయ్. అయితే ఈ సినిమాలో ఇవి మాత్రమే కాకుండా.. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన డిజిటాల్ ఇండియా.. అలాగే జి.ఎస్.టి. వంటి అంశాలపై పంచులు కూడా పేల్చారు. పెట్రోల్ మరియు కార్పొరేట వైద్యం ఎందుకని జి.ఎస్.టి పరిధిలోకి రాలేదంటూ విజయ్ చెప్పే డైలాగులు సూపర్ అని తమిళ తంబీలు అంటుంటే.. అక్కడి బిజిపె లీడర్లైన పొన్ రాధాకృష్ణన్ వంటి పెద్దలు మాత్రం.. సినిమా నుండి ఆ డైలాగులు తీయాలంటూ పట్టుబడుతున్నారు. సెన్సార్ బోర్డు వీరి మాట వినకపోతే.. కోర్టుకు వెళతాం అంటున్నారు.

ఇకపోతే ఈ డైలాగులపై నడుస్తున్న రభసలో.. దర్శకుడు పా.రంజిత్ అసలు ఈ సినిమాకు ఏం సంబంధం లేకపోయినా కూడా స్పందించాడు. ఆ డైలాగులు జనాల కష్టాలను చూపించేలా ఉన్నాయే తప్ప.. అందులో రాజకీయం ఏముంది.. వాటిని తీసేయాల్సిన అవసరం లేదంటూ కామెంట్ చేశాడు. అట్లీ డైరక్షన్లో రూపొందిన 'మెర్సాల్' సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆడుతోంది.
Tags:    

Similar News