నటసింహా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రూలర్ ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్ ఒక సెక్షన్ ని నిరుత్సాహా పరిచినా మాస్ ఆడియన్స్ కు చేరువైందని చిత్రబృందం నమ్ముతోంది. బాలయ్య శైలి యాక్షన్ సన్నివేశాలకు కొదవే లేదని ఈ ట్రైలర్ చెప్పకనే చెప్పింది. ఇక సినిమాలో బాలయ్య విశ్వరూపం ఎలా ఉండనుందో చెప్పాల్సిన పనే లేదు. అసలే జైసింహా కాంబినేషన్ కాబట్టి యాక్షన్ పీక్స్ లోనే ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక రూలర్ గురించి మరో ఆసక్తికర సంగతి తెలిసింది.
గత కొంతకాలంగా రూలర్ లో బాలయ్య పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారని.. సహాజంగా బాలయ్య కథల్లో రాజకీయాలు ఇన్ బిల్ట్ అవుతుంటాయని ఫ్యాన్స్ లో చర్చ సాగుతోంది. రూలర్ లోని తప్పకుండా రాజకీయాన్ని టచ్ చేసారని సోషల్ మీడియా ఊదరగొట్టేసింది. అయితే ఈ ప్రచారం తారా స్థాయికి చేరుకోవడంతో ఓ ఇంటర్వూలో చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ దానిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.
ఇందులో ఎలాంటి రాజకీయాలు టచ్ చేయలేదు. బాలయ్య శైలి మాస్ యాక్షన్ మూవీ ఇది. ఆయన అభిమనుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇది ఉత్తర ప్రదేశ్‌లో స్థిరపడిన తెలుగు ప్రజల జీవితాలు అక్కడి ప్రాంతీయ వివక్ష కారణంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సాగుతుందని రివీల్ చేసారు.
దీంతో ఓ రకంగా చెప్పాలంటే రూలర్ ని వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కిస్తోన్న చిత్రమేనని ఓ క్లారిటీ వచ్చినట్టే. అన్యాయాన్ని ఎదురించే నిజాయితీగల పోలీస్ అధికారిగా బాలయ్యను తెరపై చూపిస్తున్నారట. బాలయ్య ఖాకీ ధరిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన భారీ పంచ్ డైలాగులు.. యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు పెద్ద పండగే. మరి రూలర్ సత్తా ఎంతో తెలియాలంటే డిసెంబర్ 20 వరకూ వెయిట్ చేయాల్సిందే.