దసరాకు వచ్చిన సినిమా సందడి మెల్లగా తగ్గుముఖం పడుతోంది. యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది ఒక్క అరవింద సమేత వీర రాఘవ మాత్రమే. అదీ కాస్త స్లో అయినట్టు ట్రేడ్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఏదైనా మంచి విజయాన్నైతే సొంతం చేసుకుంది. ఇక ఈ వారం రాబోతున్న వాటిలో కాస్తో కూస్తో చెప్పుకోదగ్గ సినిమా వీర భోగ వసంత రాయలు ఒక్కటే. మల్టీ స్టారర్ గా పబ్లిసిటీ చేస్తున్నారు కాని ఇందులో ఉన్నదంతా యాక్టర్స్ మాత్రమే. నారా రోహిత్-సుదీర్ బాబు కాంబోలో గతంలో శమంతకమణి వచ్చింది. అదేమంత ఆశించిన ఫలితం ఇవ్వలేదు.
ఇప్పుడు వీర భోగ వసంత రాయలు పేరుతో ఒక కొత్త తరహ ప్రయోగంతో వస్తున్నారు. శ్రీవిష్ణుని గతంలో చూడని ఒక విచిత్రమైన గెటప్ లో మొన్నే ఓ స్టిల్ విడుదల చేసారు. కాస్త ఆశ్చర్యపరిచేలా కాస్త భయం పుట్టేలా ఉన్న శ్రీవిష్ణు మీద చాలా మిశ్రమ స్పందన వచ్చింది. నేటివిటీకి దూరంగా ఉండటం కూడా మైనస్ గా నిలుస్తోంది.
ఇంద్రసేన దర్శకుడిగా పరిచయమవుతున్న వీర భోగ వసంత రాయలు మీద చెప్పుకోనంత బజ్ లేకపోవడానికి కారణం సరైన రీతిలో చేరకపోవడం. దానికి తోడు దీన్ని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తరహాలో దీన్ని తెరకెక్కించాను అని చెప్పడం చూస్తే ఇది ఎంత వరకు ఇక్కడి ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది అని చెప్పడం కష్టమే. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో కథను చెప్పినప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. దాన్ని సరైన రీతిలో హ్యాండిల్ చేయలేక మణిరత్నం లాంటి దర్శకులే ఫెయిల్ అయ్యారు.
అలాంటిది మొదటిసారి ఇలాంటి ప్రయోగానికి సిద్ధపడ్డ ఇంద్రసేన దీన్ని హ్యాండిల్ చేయడం రిస్క్ తో కూడుకున్నదే. శ్రేయ మరో కీలక పాత్ర చేస్తున్నా బజ్ రావడానికి ఆ ఫ్యాక్టర్ ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. పైగా టీమ్ లో ఎవరికి సాలిడ్ గా ఈ మధ్య కాలం లో హిట్ లేదు. ట్రైలర్ లో సుధీర్ బాబు స్వంత గొంతు వినిపించలేదు. ఇన్ని ప్రతికూలతల మధ్య వీర భోగ వసంత రాయులు బరిలోకి వస్తోంది. రెండు రోజులు ముందే యుఎస్ ప్రీమియర్స్ వేస్తున్నారు