పాన్ ఇండియా మల్టీస్టార్ #RRRలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఓ కామియోలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బ్రిటీష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. తెరపై కనిపించినంత సేపు ఆ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్న ప్రచారం ఉంది. భారీ పారితోషికం ఎర వేసి ఏరికోరి మరీ అజయ్ దేవగణ్ ను జక్కన్న దింపారని ప్రచారమైంది. బాలీవుడ్ మార్కెట్ ని రాబట్టుకోవడమే ధ్యేయంగా ఈ ప్లాన్ చేశారు. అందుకే దేవగణ్ బాలీవుడ్ లో ఒక స్ట్రెయిట్ సినిమాకి తీసుకునేంత పారితోషికం చెల్లించారన్న ప్రచారం సాగింది. దేవగణ్ కి ప్రత్యేకించి బాలీవుడ్ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని ప్యాకేజీ మాట్లాడారని .. లాభాల్లో వాటా ఇస్తున్నారని అడ్వాన్స్ డ్ గానే ప్రచారమైంది. అడ్వాన్స్ గా కొంత చెల్లించి... బ్యాలెన్స్ ఆయన పాత్ర చిత్రీకరణ అనంతరం చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారట.
అయితే తాజాగా ఆయన పారితోషికం వ్యవహారంపై ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాకు అజయ్ దేవగణ్ రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా చేస్తున్నారుట. కేవలం రాజమౌళితో తనకు ఉన్న స్నేహం..రిలేషన్ కారణంగా ఎలాంటి పారితోషికం తీసుకోవడం లేదుట. నిర్మాత దానయ్యతో రాజమౌళితో చర్చించి మొత్తం ఒకేసారి చెల్లిద్దాం అన్నారట.
కానీ అజయ్ ఎంత మాత్రం ఆ ప్రపోజల్ కు ఒప్పుకోలేదుట. దానయ్య కూడా అజయ్ దేవగణ్ తో వ్యక్తిగతంగా ఈ విషయంపై మాట్లాడినా ఉత్తరాది సింగం ససేమిరా అన్నారుట. అదే నిజమైతే నిర్మాతకు భారీగానే ఆదా అయినట్లే. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ సహా టాలీవుడ్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఇటీవలే అజయ్ దేవగణ్ బాలీవుడ్ లో తానాజీ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.