న్యాచురల్ స్టార్ నాని ఈరోజు (ఫిబ్రవరి 24) పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 2008 లో 'అష్టా చెమ్మా' సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాని ఇప్పటివరకూ 24 సినిమాలు పూర్తి చేసి ప్రస్తుతం 25 వ సినిమా'V' లో నటిస్తున్నాడు. ఈ వేసవిలోనే 'V' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే నాని బర్త్ డే హంగామా సోషల్ మీడియాలో ఈసారి చాలా తక్కువగా ఉంది.
సహజంగా స్టార్ హీరోల పుట్టినరోజు అంటే అభిమానులు సోషల్ మీడియాలో హ్యాపీ బర్త్ డే హ్యాష్ టాగ్స్ ట్రెండ్ చేస్తారు. వీటికి ఫ్యాన్స్ అసోసియేషన్లతో పాటుగా హీరోగారి పీఆర్ టీమ్ తమ సహకారం అందిస్తారు. అయితే ఈసారి నాని బర్త్ డే హడావుడి ఎందుకో మిస్ అయింది. ఈమధ్య వరస ఫ్లాపులతో నాని క్రేజ్ తగ్గడం ఇందుకు ఒక కారణం కాగా.. విజయ్ దేవరకొండ లాంటి యువ హీరోల రాకతో నాని హవా కొంత తగ్గింది. మిడ్ రేంజ్ హీరోలలో నాగచైతన్య.. రామ్ లాంటి వారు ఫామ్ లోకి రావడం కూడా నానికి నెగెటివ్ గా మారింది. ఇలాంటి కారణాల వల్లే సోషల్ మీడియాలో నాని జన్మదిన వేడుకల రచ్చ మునుపటి స్థాయిలో లేదని అంటున్నారు.
ఈ ప్రభావం నాని కొత్త సినిమా 'V' పై పడే అవకాశం లేకపోలేదనే వాదన వినిపిస్తోంది. వరసగా ఫ్లాపులు రావడంతో నాని కొత్త సినిమా 'V' పై ప్రేక్షకుల్లో పెద్దగా అసక్తి కనిపించడం లేదు. సినిమాకు బిజినెస్ జరగొచ్చేమో కానీ నాని సినిమాలకు ఉండే ఆ బజ్ మాత్రం ఈ సినిమాకు లేదు. నాని నెగెటివ్ రోల్ ను ప్రేక్షకులు ఎంత మాత్రం యాక్సెప్ట్ చేస్తారో అనే అనుమానాలు ఉన్నాయి. ఈ సినిమా ఫలితం అటూ ఇటూ అయితే నాని కెరీర్ కు ఇబ్బంది తప్పదని కూడా అంటున్నారు. మరి నాని ఈ నెగెటివిటీ నుంచి ఎలా బయటకు వస్తాడో చూడాలి.