`కేజీఎఫ్ చాప్టర్ 1` సంచలన విజయం నేపథ్యంలో `కేజీఎఫ్ చాప్టర్ 2`ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సీక్వెల్ ని పార్ట్ 1తో పోలిస్తే రెట్టింపు బడ్జెట్ తో భారీ తారాగణంతో తెరకెక్కించేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ కథాంశాన్ని కూడా మరో లెవల్లో తయారు చేయించారని.. ఆ క్రమంలోనే రెండో భాగం మరోమారు సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తుందని హైప్ క్రియేటైంది. తొలి భాగం కంటే రెండో భాగంలో రెట్టింపు యాక్షన్ కళ్లు జిగేల్ మనిపిస్తుందని ప్రచారమైంది. కాస్టింగ్ పరంగానూ మరో లెవల్లో ఉంటుందని ఊదరగొట్టేశారు.
సినిమా ఆరంభం నుంచి ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో.. మున్నాభాయ్ సంజయ్ దత్ నటిస్తున్నారని వైరల్ గా ప్రచారం సాగింది. దత్ రాకతో ఈ ఫ్రాంఛైజీ స్థాయి మరో లెవల్ కి చేరిందని... అలాగే బాలీవుడ్ మార్కెట్ కి అతడు పెద్ద బూస్ట్ అవుతాడని ట్రేడ్ విశ్లేషించింది. అలాగే ఈ చిత్రంలో రవీనా టాండన్ ఓ కీలక పాత్రలో నటించనుందని ప్రచారమవుతోంది. అయితే సదరు బాలీవుడ్ స్టార్లు నటిస్తున్న మాట నిజమా? అని ఆరాతీస్తే అసలు సంగతి తెలిసింది.
మున్నాభాయ్ తో కేజీఎఫ్ టీమ్ చర్చలు సాగించిన మాట వాస్తవం. అయితే ఈ సినిమాకి ఇప్పటివరకూ సంజూ అస్సలు సంతకం చేయలేదట. ఆయన నటించడం ఖాయమేనంటూ ప్రచారం అయితే సాగిపోయింది. కానీ అతడు నటిస్తాడు అన్నదానికి గ్యారెంటీ కూడా ఇవ్వలేదింకా. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో సంజూ భాయ్ నటిస్తేనే బావుంటుందని బలంగా నమ్ముతున్నారు. తొలి భాగంలో దత్ కి ఓ క్యారెక్టర్ ని ఆఫర్ చేసినా ఆయన కాదనుకున్నారు. కానీ పార్ట్ 1 పెద్ద సక్సెస్ కావడంతో రెండో భాగం కథ విన్నారు. తన పాత్రను కూడా ఆయన పరిశీలించారు. అంతవరకూ జరిగింది. మరో వైపు హోంబలే ఫిలింస్ సంస్థ రాజీ అన్నదే లేకుండా పెట్టుబడులు పెట్టడమే గాక ప్రశాంత్ నీల్ అడిగిన ప్రతిదీ సమకూరుస్తోంది.
అత్యంత దుర్భేద్యమైన భళ్లారి మైన్స్ కావాలని అడిగితే అక్కడ షూటింగ్ కోసం అనుమతుల్ని సంపాదించారు. రామోజీ ఫిలింసిటీలో భారీ షెడ్యూల్ కి అవసరమైన సెట్లు వగైరా వాటి కోసం కోట్లాది రూపాయల్ని హోంబలే సంస్థ ఖర్చు చేస్తోందట. తొలి భాగంలో అంతం లేని అరాచకులతో కూడుకున్న మాఫియా యాక్టివిటీస్ జనాలకు పిచ్చిగా నచ్చేశాయి కాబట్టి ఆ తరహా అరాచకాల్ని మరింతగా పెంచుతూ రెండో భాగం కథని రాసుకున్నారు. సంజయ్ దత్ లాంటి ఛరిష్మా ఉన్న స్టార్ యాడైతే సినిమాలో మ్యాటర్ పెరుగుతుందని భావించారు. కానీ మున్నాభాయ్ ఇప్పటికీ ఈ సినిమాకి సంతకం చేయకపోవడంతో కాస్తంత సందిగ్ధత ఏర్పడిందని ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. మరి ఈ చిత్రానికి దత్ సంతకం చేస్తారా లేదా? ఏం జరుగుతోంది? అన్నది టీమ్ స్వయంగా ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటీనటులు నటిస్తారని మాత్రం కాన్ఫిడెంట్ గా టీమ్ చెబుతోంది.