ఈ మధ్య కొన్ని సర్వేలు ఏ ప్రాతిపదికన చేస్తున్నారో వాటి ఫలితాలను ఏ శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషిస్తున్నారో తెలియదు కాని వాటిని జనామోద అభిప్రాయంగా ప్రచారం చేయడం వాటి వల్ల పబ్లిక్ అవే నిజమని నమ్మడం జరుగుతోంది. విషయానికి వస్తే టిఆర్ఎ సంస్థ భారతదేశపు అత్యంత నమ్మదగిన వ్యక్తుల పేర్లు వెల్లడించింది. 16 నగరాల్లో చేసిన సర్వే ఆధారంగా ప్రకటించిన పేర్లలో అమితాబ్ బచ్చన్ టాప్ పొజిషన్ లో ఉన్నారు.
సరే ఆయన గురించి ఇది అందరూ ఒప్పుకునేదే కాబట్టి ఓకే అందాం. మిగిలినవారి సంగతి చూస్తే సూపర్ స్టార్ రజనికాంత్ మరో స్టార్ హీరో విజయ్ ప్రయోగాల నటుడు విక్రం ఇలా అందరూ ఉన్నారు కాని విచిత్రంగా ఒక్కరంటే ఒక్కరు తెలుగు హీరో లేకపోవడం వింతలలో వింత .తీసుకున్నదే పదహారు సిటీలు. అంటే అక్కడ సేకరించిన డేటా ఆధారంగా దేశవ్యాప్తంగా వర్తిస్తుంది అనేలా ఇలా చెప్పడం గురించి టాలీవుడ్ మూవీ లవర్స్ భగ్గుమంటున్నారు.
చిరంజీవి లాంటి అగ్ర సీనియర్ కథానాయకుడు మొదలుకుని మహేష్ బాబు లాంటి స్టార్ దాకా ఎందరో ఉండగా ఒక్కరి ప్రస్తావన లేకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. హెడ్డింగ్ మోస్ట్ ట్రస్టబుల్ పర్సనాలిటీ అని పెట్టారు కాని అసలు సదరు సంస్థ తీరే ట్రస్టబుల్ గా లేదనే కామెంట్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా సౌత్ లో రాసిలో వాసిలో కీలక పాత్ర పోషిస్తున్న టాలీవుడ్ నుంచి ఎవరి పేరు లేకపోవడం మాత్రం ఖండించదగినదే