కథ రాయడానికి.. సినిమా తీయడానికి ఉన్న క్లారిటీ టైటిల్ విషయంలో లేకపోవడం చిత్రమే అని చెప్పాలి. పేరు పెట్టకుండా సినిమా మొదలుపెట్టడమనే కాన్సెప్టే చాలామందికి మింగుడు పడదు. చిన్న, మీడియం రేంజి సినిమాల విషయంలో అయితే టైటిల్ విషయం ఎవరికీ పట్టదు కానీ.. స్టార్ హీరోల సినిమాల విషయంలో మాత్రం అభిమానుల్లో విపరీతమైన క్యూరియాసిటీ ఉంటుంది. పేరు పెట్టకుండా సినిమా మొదలుపెడితే.. ఇక అప్పట్నుంచి ఒకటే ఊహాగానాలు మొదలవుతాయి. ఆ హీరో సినిమా టైటిల్ ఇదట.. అదట.. అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతాయి. సాధారణంగా మహేష్ బాబు సినిమాల విషయంలో టైటిల్ సస్పెన్స్ ఎక్కువగా ఉంటుంటుంది. ఇప్పడు మిగతా స్టార్ హీరోలు కూడా ఇదే దారిలో పయనిస్తున్నారు.
ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మూడు సినిమాల టైటిళ్ల గురించి విపరీతమైన ఆసక్తి నెలకొంది. రామ్ చరణ్-శ్రీనువైట్ల, ఎన్టీఆర్-సుకుమార్, అఖిల్-వినాయక్ సినిమాలకు ఇంకా టైటిల్ పెట్టలేదు. చరణ్ సినిమాకు బ్రూస్లీ అని, సుప్రీం అని టైటిళ్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు ఫైటర్ అంటున్నారు. ఇక అఖిల్ సినిమాకు మిస్సైల్ అన్న టైటిల్ అంటూ ఊహాగానాలు వచ్చాయి కానీ.. అది నిజం కాదనేశాడు నితిన్. ఇప్పుడు తాండవం అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. వినాయక్ మాత్రం కన్ఫమ్ చేయట్లేదు. సెప్టంబరు 20న ఫస్ట్ లుక్ టీజర్ విడుదల సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేస్తారంటున్నారు. ఇక ఎన్టీఆర్ మూవీకి ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలొచ్చాయి కానీ.. అది నిజం కాదని తేలింది. మరి టైటిల్ విషయంలో కనీసం వాళ్లకైనా క్లారిటీ ఉందా? ఊరికే అభిమానుల్ని ఊరించడానికే ఇలా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారా? అన్నదే అర్థం కావడం లేదు.