ట్రైలర్ లేదేంటి గోవిందం?

Update: 2018-08-15 10:50 GMT
టాలీవుడ్ సెన్సేషన్ 'అర్జున్ రెడ్డి' తర్వాత విజయ్ దేవరకొండ సోలో హీరోగా నటించిన 'గీత గోవిందం' ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడ్వాన్సు బుకింగ్స్ జోరుగా ఉంటే మౌత్ టాక్ - రివ్యూస్ పాజిటివ్ గా ఉన్నాయి.  అసలే పోటీ కూడా లేదు కాబట్టి ఓపెనింగ్ కలెక్షన్స్ తో మన టాలీవుడ్ 'రౌడీ' హంగామా సృష్టించడం ఖాయం.

అంతా సూపర్ గా ఉంది గానీ మీరొక విషయం గమనించారా..? ఈ సినిమాకు అసలు ట్రైలరే రిలీజ్ చెయ్యలేదు. అయినా ఈ సినిమాకొచ్చిన ఇబ్బందేమీ లేదు. ఈ సినిమా ఇతర ప్రోమోలతో పాటు టీజర్ మాత్రమే రిలీజ్ అయింది.  టాలీవుడ్ లో ఇలా జరగడం చాలా అరుదు.  అసలెందుకు ట్రైలర్ రిలీజ్ కాలేదు?  నిజానికి 'గీత గోవిందం' టీమ్ ట్రైలర్ ను రిలీజ్ చేయాలనే అనుకున్నారట.  కానీ ఈ సినిమా పైరసీ కాపీలు బయటకు రావడంతో ఆ సమస్యను ఎదుర్కొనేందుకు టీమ్ అంతా పని చేయడం జరిగిందట. దీంతో ట్రైలర్ సంగతే పట్టించుకోలేదట.  ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను కూడా క్యాన్సిల్ చేద్దామని అనుకున్నా ఆడియన్స్ - ఫ్యాన్స్ నిరాశచెందుతారని ఈవెంట్ ను జరిపారట.

ఇలా ఒక హైప్ ఉన్న సినిమా ట్రైలర్ లేకుండా రిలీజ్ కావడం ఈమధ్య ఒక 'కబాలి' విషయం లో నే జరిగింది.  ఆ తర్వాత మన విజయ్ దేవరకొండ సినిమాకే ఆ ఘనత. ఆ విషయంలో మాత్రమే పోలిక సినిమా కంటెంట్ విషయంలో మాత్రం కాదు.. గుర్తించగలరని మనవి.
Tags:    

Similar News