పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు మూడున్నరేళ్ల విరామం తరువాత బ్యాక్ టు బ్యాక్ రీమేక్ సినిమాలని లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. 'వకీల్ సాబ్' ని బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'పింక్' ఆధారంగా తెలుగులో శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో రీమేక్ చేశారు. దీని తరువాత కూడా మరో మూడు రీమేక్ మూవీస్ ని పవన్ లైన్ లో పెట్టారు. అయితే అందులో ఒకటి మాత్రమే ఇప్పటి వరకు విడుదలైంది. మరో రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లాల్సి వుంది.
అయితే ఇంత వరకు పవన్ కల్యాణ్ ఆ రీమేక్ ల ఊసే ఎత్తడం లేదు. వాటి గురించి మేకర్స్ కూడా సైలెంట్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా వుంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలిసారి చేస్తున్న భారీ పీరియాడిక్ ఫిల్మ్ 'హరి హర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఏ.ఎం. రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ మూవీని భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా? .. ఎప్నుడెప్పుడు థియేటర్లలోకి వచ్చేస్తుందా? అని పవన్ అభిమానులు, సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొన్ని నెలలుగా షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఎట్టకేలకు పవన్ ముందు అనుకున్నతన ప్లాన్ ని ఛేంజ్ చేసుకోవడంతో 'హరి హర వీరమల్లు' తాజా షెడ్యూల్ త్వరలో ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించిన వర్క్ షాప్ లో ఇటీవల పవన్ తో పాటు ప్రధాన టీమ్ పాల్గొన్న విషయం తెలిసిందే.
అక్టోబర్ నుంచే తాజా షెడ్యూల్ ని ప్రారంభించబోతున్నారు. పోరాట ఘట్టాలకు సంబంధించిన ప్రాక్టీస్ ని పవన్ ఇటీవలే మొదలు పెట్టారు కూడా. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ మూవీ షూటింగ్ ని పూర్తి చేసి ఆ తరువాత పవన్ మరో రీమేక్ మూవీకి డేట్స్ ని కేటాయించనున్నారట. 'సాహో' ఫేమ్ సుజీత్ డైరెక్షన్ లో 'తేరీ' రీమేక్ ని చేయబోతున్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా డిలే అవుతూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ మొత్తానికి పట్టాలెక్కుతున్నట్టుగా తెలుస్తోంది.
అయితే సముద్రఖని మాత్రం అయోమయానికి గురవుతున్నారట. తను నటించి డైరెక్ట్ చేసిన 'వినోదాయ సితం' రీమేక్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కీలక పాత్రలో సాయి ధరమ్ తేజ్ కూడా నటించనున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తయింది.
పవన్ పిలుపిస్తే వెంటనే సెట్స్ పైకి వెళ్లడానికి రెడీగా వుంది. నటుడు సముద్రఖని ఈ రీమేక్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. మారిన పవన్ ప్లాన్ కారణంగా తన సినిమా ఎప్పుడు పట్టాలెక్కేది సముద్రఖనికి క్లారిటీ రావడం లేదట. దాంతో తను అయోమయానికి గురవుతున్నట్టుగా ఇన్ సైడ్ టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.