ఒక్కోసారి ప్రేమ ఎక్కువైనా కష్టమే. ఇందుకు బెల్లంకొండ సురేష్ వ్యవహారమే నిదర్శనం. కొడుకును హీరోను చేసే క్రమంలో నేల విడిచి సాము చేశాడీ ప్రొడ్యూసర్. ఇప్పుడు కొడుకు కెరీర్ ను ఎలా నిలబెట్టాలో తెలియక తికమక పడుతున్నాడు. నిజానికి బెల్లంకొండ శ్రీనివాస్ బ్యాగ్రౌండ్ ప్రకారం చూస్తే తొలి సినిమా ‘అల్లుడు శీను’ సూపర్ హిట్టే. దాదాపు రూ.20 కోట్లు వసూలు చేసిందా సినిమా. కానీ సినిమాకైన ఖర్చు దానికి రెట్టింపు. దీంతో నిండా మునిగిపోయాడు బెల్లంకొండ. పూలమ్మిన చోటే కట్టెలమ్మినట్లు.. వినాయక్ లాంటి బడా డైరెక్టర్ తో కొడుకును ఇంట్రడ్యూస్ చేసి, ఇప్పుడు భీమనేని శ్రీనివాస్ లాంటి ఛోటా దర్శకుడితో, ఓ లో బడ్జెట్ మూవీతో సర్దుకుపోవాల్సి వస్తోంది.
వినాయక్ తొలి సినిమాతో బూస్ట్ ఇచ్చినా.. తర్వాత కూడా అలాంటి భారీ సినిమా చేస్తేనే దాని తాలూకు మైలేజి నిలిచేది. కానీ బోయపాటి శ్రీనుతో అనుకున్న సినిమా కార్యరూపం దాల్చలేదు. దీంతో భీమనేనితో తమిళ రీమేక్ చేస్తున్నాడు. దీంతో తొలి సినిమా విషయంలో చేసిన హంగామా అంతా వేస్ట్ అయినట్లైంది. పోనీ భీమనేని సినిమా అయినా బాగా సాగుతోందా అంటే.. ఆ విషయంలోనూ అనేక అనుమానాలు మొదలవుతున్నాయి. సినిమా మొదలుపెట్టి దగ్గర దగ్గర ఏడాదవుతోంది. కానీ ఇప్పటిదాకా నో అప్ డేట్. దీంతో అసలు షూటింగ్ సజావుగా సాగుతోందా.. ఔట్ పుట్ బాగానే వస్తోందా అని అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తానికి పరిస్థితి చూస్తుంటే ఘనంగా మొదలైన బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్.. ప్రస్తుతం అయోమయంలో పడ్డట్లే కనిపిస్తోంది.