రామ్ గోపాల్ వర్మ తీసిన హిట్ సినిమాలేవంటే చకచకా ఆ లిస్టు చదివేస్తాం. కానీ ఆయన తీసిన ఫ్లాపులు.. అట్టర్ ఫ్లాపులు.. డిజాస్టర్ల గురించి చెప్పమంటే మాత్రం చాలా సమయం పడుతుంది. అన్నింటినీ లెక్కలోకి తీసుకురావడం అంత ఈజీ కాదు. ఈ ఫ్లాపుల వరదలో మరుగున ఉండిపోయే సినిమా ‘అగ్యాత్’. నితిన్ హీరోగా ఆయన తెరకెక్కించిన హిందీ సినిమా ఇది. దీన్ని తర్వాత ‘అడవి’ పేరుతో తెలుగు లోనూ రిలీజ్ చేశారు. వర్మ నెమ్మదిగా ఫామ్ కోల్పోతున్న టైంలో తీసిన చిత్రమిది. ఐతే ఇది వచ్చిన సంగతి తెలియదు. వెళ్లిన సంగతి తెలియదు. అంత పెద్ద ఫ్లాప్ అయిందా చిత్రం. అలాంటి సినిమా మీద ఇప్పుడు గొడవ నడుస్తుండటం విశేషం.
2009లో విడుదలైన ‘అగ్యాత్’ సినిమాకు సంబంధించి కథ తనదంటూ సిద్ధిక్ ముస్తాక్ ముహసిన్ అనే రచయితఅప్పట్లో కోర్టులో కేసు వేశాడు. తాను ఒక కథ తయారు చేసి వర్మకు పోస్ట్ చేశానని.. ఐతే దీనిపై వర్మ నుంచి తనకు ఎలాంటి సమాధానం రాలేదని.. కానీ 2009లో ఆయన చేసిన ‘అగ్యాత్’ సినిమా చూస్తే అది తన కథతో చేసిందే అని అర్థమయిందని అతను తన పిటిషన్ లో వాదించాడు. సినిమాలో తనకు క్రెడిట్ ఇవ్వకపోగా.. తాను దీనిపై నిలదీసినా స్పందించలేదని అతనంటున్నాడు. ఈ కేసు చాలా ఏళ్ల నుంచి విచారణలో ఉండగా.. విచారణకు రావాలని కోర్టు పంపిన నోటీసులకు వర్మ నుంచి సమాధానమే లేకపోయింది. దీంతో అతడికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. మరి వర్మ ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించుకుంటాడో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/