ఏళ్ల వయసులో వెయిట్రెస్ గా పనిచేసినట్లు తెలిపిన 'బాహుబలి మనోహరి'..!

Update: 2021-10-07 02:30 GMT
కెనడియన్ బ్యూటీ నోరా ఫతేహీ.. ఐటమ్ సాంగ్స్ లో ఆడిపాడుతూ బాలీవుడ్ లో స్పెషల్ గర్ల్ గా తనదైన ముద్ర వేసింది. బిగ్ బాస్ సీజన్-9 తో పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామ తెలుగులో కూడా పలు ప్రత్యేక గీతాల్లో నర్తించింది. 'టెంపర్' సినిమాలో 'ఇట్టాగే రెచ్చిపోతా'.. 'బాహుబలి: ది బిగినింగ్' చిత్రంలో 'మనోహరి' పాటలలో నోరా అదరగొట్టింది. ఈ క్రమంలో 'లోఫర్' 'కిక్ 2' 'షేర్' 'ఊపిరి' వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో స్టెప్పులేసింది. ప్రస్తుతం పలు హిందీ సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా టీనేజ్ లో పడిన కష్టాలను గుర్తు చేసుకున్నారు.

లేటెస్టుగా 'స్టార్ Vs ఫుడ్ 2' షోలో పాల్గొన్న నోరా ఫతేహి గతంలో వెయిట్రెస్ గా పనిచేసిన విషయాన్ని వెల్లడించారు. "నేను 16 సంవత్సరాల వయస్సులో వెయిట్రెస్ గా పనిచేశాను. ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే దీనికి కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటుగా వ్యక్తిత్వం మరియు మంచి జ్ఞాపకశక్తి ఉండాలి..కస్టమర్లు నీచంగా ప్రవర్తించినా.. తప్పనిసరిగా పరిస్థితులను బట్టి మర్యాదగా నడుచుకోవాల్సి ఉంటుంది" అని నోరా ఫతేహీ తెలిపింది.

ఇంకా కెనడియన్ ప్రజల గురించి మాట్లాడుతూ.. అక్కడ ఆకర్షణీయమైన స్వచ్ఛందమైన మహిళలను ప్రేమిస్తారని.. సన్నగా ఉండటాన్ని వారు ఇష్టపడరని నోరా చెప్పింది. ఇదొక సాంస్కృతిక మనస్తత్వమని.. అందుకే తాము ఎప్పడూ తింటూనే ఉంటామని నోరా ఫతేహీ తెలిపారు. ఇక కెరీర్ విషయానికొస్తే.. నోరా ఫతేహీ చేసిన 'చోడ్ దేంగే' అనే సాంగ్‌ యూట్యూబ్‌ లో మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇక జాన్ అబ్రహం నటించిన 'సత్యమేవ జయతే 2' చిత్రంలో నోరా ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది.


Tags:    

Similar News