పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్ నిర్మాణంలో 'భయదీయుడు భగత్ సింగ్' చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డిలే విషయంలో నెట్టింట జరిగిన ప్రచారం అంతే ఆసక్తికరం. ఇలా సినిమా ఆలస్యమయ్యే సరికి రకరకాల కథనాలు అభిమానుల్లో ఆసక్తికరంగా మారాయి. ఇది తమిళ సినిమా 'తేరి'కి రీమేక్ అని పెద్ద ఎత్తున ప్రచారం సాగడంతో హరీష్ శంకర్ ట్రోలింగ్ సైతం ఎదుర్కోవాల్సి వచ్చింది.
గత కొన్ని రోజులుగా #WeDont WantTheriRemake అనే హ్యాష్‌ట్యాగ్‌తో పవన్ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. అయితే చిత్ర నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఉదయం అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. సైలెంట్ గా సినిమాకి సంబంధించిన కొత్త టైటిల్ తో పాటు..పవన్ లుక్ ని రిలీజ్ చేసింది. సినిమాకి 'ఉస్తాద్ భగత్ సింగ్' అని కొత్త టైటిల్ నిర్ధారించారు.
ఆ టైటిల్ కింద 'మనల్ని ఎవడ్రా ఆపేది' అంటూ ట్యాగ్ లైన్ కూడా కనిపిస్తుంది. దీన్ని బట్టి మరింత పవర్ పుల్ కంటెంట్ తోనే పీకే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది చూసి అభిమానులకు షాక్ అవుతున్నారు. ముందుగా భయదీయుడు భగత్ సింగ్ గా ప్రకటించి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అయ్యాడేంటి? అంటూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
అలాగే ఇది స్ర్టెయిట్ సినిమానా? తేరికి రీమేక్ నా? అన్నది క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అభిమానుల సందేహాలు మరింత బలపడుతున్నాయి. ఓవైపు రీమేక్ వద్దు అంటూ ఫ్యాన్స్ గొల పెడుతున్నా? దానికి ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం..టైటిల్ మార్చడం...
రాజకీయాల్ని నేపథ్యంలో పీకే వాడిన పదజాలాన్నిట్యాగ్ లైన్ గా పెట్టడం తో కాస్త అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఆసంగతి పక్కనబెడితే పోస్టర్ మాత్రం సీరియస్ యాక్షన్ డ్రామాని సూచిస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. అయనంక బోస్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.