టాలీవుడ్ తో పాటు పలు ఇండియన్ భాష ల సినిమాల యొక్క విదేశీ షెడ్యూల్స్.. విదేశీ షూటింగ్స్ అనగానే ఎక్కువ శాతం మందికి అమెరికా నే గుర్తుకు వస్తుంది. అమెరికా నేపథ్యంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్దకు కొన్ని వందల సినిమాలు వచ్చాయి అనడంలో సందేహం లేదు. కాని ఇక నుండి ఇండియన్ సినిమాల్లో అమెరికా ఎక్కువగా కనిపించక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అమెరికాలో షూటింగ్ లకు ఇంతకు ముందు చాలా సింపుల్ ప్రాసెస్ ఉండేది. వీసా కూడా చాలా ఈజీగా ఇచ్చేవారు. కాని కరోనా ఇతర కారణాల వల్ల ఇప్పుడు అమెరికాలో సినిమా షూటింగ్ చేయాలి అంటే పెద్ద తలనొప్పిగా ఉంది.
అమెరికాలో షూటింగ్ కు వెళ్లాలి వీసా ప్రాసెస్ కు కనీసం నెల రోజుల సమయం పడుతుంది. అది కాకుండా వీసా నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటున్నాయి.
అమెరికాలో ఒక కీలక షెడ్యూల్ ప్లాన్ చేసిన NBK107 దర్శకుడు గోపీచంద్ మలినేని వీసా సమస్య కారణంగా తన షెడ్యూల్ ను టర్కీ కి మార్చుకున్న విషయం తెల్సిందే. ఆయన మాత్రమే కాకుండా పలువురు దర్శకులు కూడా అమెరికాలో షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకుని ఇండియాలోనే మ్యానేజ్ చేయడం లేదంటే బాలయ్య మాదిరిగా ఏ టర్కీ నో లేదంటే యూరప్ వెళ్లాలని భావిస్తున్నారు.
అమెరికాలో ప్రస్తుత పరిస్థితులు ముందు ముందు కూడా ఇలాగే ఉంటాయా లేదంటే మళ్లీ యధావిధిగా మారుతాయా అనేది చెప్పలేమనే సమాధానం వినిపిస్తుంది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఈ కఠిన ఆంక్షలు పెడుతుందనేది సమాచారం. అమెరికా ప్రయాణాల విషయంలో ప్రయాణికులు ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది.
వీసా కు చాలా సమస్యలు ఎదురు అవుతున్న నేపథ్యంలో పలు సినిమాల యొక్క అమెరికా షెడ్యూల్స్ ను క్యాన్సిల్ చేసుకుని వేరు వేరు దేశాలకు ప్లాన్ చేస్తున్నారని ఒక జాతీయ స్థాయి మీడియా వ్యక్తి తన సోషల్ మీడియా అకౌంట్ లో పేర్కొన్నాడు. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందనే విషయమై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేక పోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.