ఓటుకు నోటు అనగానే చంద్రబాబు .. రేవంత్ రెడ్డి సహా ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు వినిపిస్తాయి. కానీ ఇప్పుడు ఓటుకు నోటు పారేది మూవీ ఆర్టిస్టుల ఎన్నికల్లో అని తెలిస్తే షాక్ తింటారు. కేవలం 950 ఓట్లు ఉన్న ఆర్టిస్టుల ఎన్నికలకు అంతటి ప్రాధాన్యత దేనికో! అంటూ పెదవి విరిచేసేవాళ్లే ఉన్నారు. కానీ ఓటుకు నోటు అంటూ టాక్ హీటెక్కిస్తోంది.
950 మంది ఆర్టిస్టుల్లో కేవలం 500 ఓట్లు మాత్రమే పోల్ అవుతాయి. ఇప్పుడు ఎలక్షన్ ప్రతిష్ఠాత్మకంగా మారడంతో ప్రధాన అభ్యర్థులు ఓటుకు నోటు ముట్టజెబుతున్నారట. ఒక్కో ఓటుకు 10వేల వరకూ గిట్టుబాటు అవుతోందని సమాచారం.
ఈసారి ఎన్నికల్లో బడా ఆర్టిస్టులంతా ఓటేసే సన్నివేశం కనిపిస్తోంది. ఇకపోతే కరోనా కష్టకాలంలో సరైన ఆఫర్లు లేక ఇబ్బందుల్లో ఉన్న ఆర్టిస్టులకు కొదవేమీ లేదు. అలాంటి వాళ్లంతా నిర్మొహమాటంగా ఓటుకు నోటు అందుకుంటున్నారట. పది వేలు అంటే తక్కువేమీ కాదు. నెలరోజుల పాటు ధీమాగా ఉపాధి సాగుతుంది.
మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ వర్సెస్ మంచు విష్ణు ప్యానల్ వార్ నడుస్తోంది. ఎవరికి వారు ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఎవరు గెలుస్తారు? అన్నది తేలాల్సి ఉంది. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.