ఈవిడేమైనా రెబ‌ల్ క్వీన్ అనుకుంటోందా?

Update: 2020-10-30 11:10 GMT
జీవితంలో ఏదీ వృథా కాదు.. నిజాయితీ హార్డ్ వ‌ర్క్ ఉంటే... ఆ రెండిటి వ‌ల్ల‌నే తాను ఈ స్థాయిలో ఉన్నాన‌ని కూడా  అంటోంది!.. బాగా శ్ర‌మిస్తే ప్ర‌తిదీ నీ చెంత‌కే చేరుతుంది. ప్ర‌స్తుతానికి న‌ట‌నే నా మైండ్ లో ఉంది! అంటూ స‌డెన్ ఝ‌ల‌క్ ఇచ్చింది నీతూ చంద్ర‌.

హీరో రాజ‌శేఖ‌ర్ స‌హా విశాల్ స‌ర‌స‌న ఈ భామ న‌టించింది. అప్ప‌ట్లో రాజ‌శేఖ‌ర్ తో ఓ వివాదంలో నీతూ పేరు మార్మోగింది. ఆ త‌ర్వాత స్వ‌లింగ సంప‌ర్కురాలిగా మ్యాగ‌జైన్ క‌వ‌ర్ షూట్ కి ఇచ్చిన ఫోజుతో కుర్ర‌కారులోనూ హాట్ టాపిక్ గా మారింది. పెటా ఫోటోషూట్ తోనూ ఈ అమ్మ‌డు బాగా పాపుల‌రైంది.

అయితే న‌టిగా కంటే ఇత‌ర వివాదాంశాల‌తోనే నీతూ చంద్ర పేరు ఎక్కువ‌గా వినిపించింది. అదంతా స‌రే కానీ.. ఇటీవ‌ల నీతూ ఏం చేస్తోంది?  సినిమాల్లో న‌టిస్తోందా లేదా? అంటే త‌నే ఓ అప్ డేట్ ఇచ్చింది. ప‌నిలో ప‌నిగా యూత్ కి అదిరిపోయే క్లాస్ తీస్కుంది!

ఇటీవ‌ల భోజ్ పురి మూవీ బెష్వా 37 ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింఫెస్టివ‌ల్ కి వెళ్లి అవార్డులు రివార్డులు గెలుచుకుంద‌ని తెలిపింది నీతూ.. అలాగే ఓ హాలీవుడ్ సినిమాలో న‌టించేందుకు బ్రిట‌న్ వెళుతున్నాన‌ని ముంబై నుంచి వెళ్లేందుకు వీసా కూడా రెడీ అయ్యింద‌ని వెల్ల‌డించింది. ఇంత‌కీ ఏ హాలీవుడ్ మూవీ అంటారా.. సోనీ మోష‌న్ పిక్చ‌ర్స్ తెర‌కెక్కిస్తోంద‌ట‌. కోవిడ్ వ‌ల్ల స్ట‌క్క‌యిపోయాను కానీ ఈపాటికే లాస్ ఏంజెల్స్ లో ఉండాల్సిన దానిని అని కూడా నిర్వేదం క‌న‌బ‌రిచింది. ఈరోజే లండ‌న్ వెళ్లాలని ఎమ‌ర్జెన్సీ వీసా కావాల‌ని కూడా రెండ్రోజుల క్రితం ప్రాధేయ‌ప‌డింది నీతూ. ఎట్ట‌కేల‌కు త‌న ప్రార్థ‌న ఫ‌లించి వీసా ద‌క్కించేసుకుంది. ఈపాటికే లండ‌న్ విమానం ఎక్కేసే ఉంటుంది మ‌రి. తాజాగా నీతూ చంద్ర షేర్ చేసిన ఓ ఫోటో అంత‌ర్జాలంలో సునామీలా మారింది. ఈవిడేమైనా రెబ‌ల్ క్వీనా?అంటూ కామెంట్లు ప‌డిపోతున్నాయ్ ఈ లుక్ చూసి.
Tags:    

Similar News