ఈ మధ్యకాలంలో సినీ ప్రేక్షకులకు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే అవకాశం సరిగ్గా దొరకలేదు. గతేడాది చివరిలో థియేటర్స్ తెరచుకున్నప్పటికి రెండు నెలల అనంతరం థియేటర్లకు 100% అక్యూపెన్సీ లభించింది. కానీ థియేటర్స్ రన్ అవుతూ నెలరోజులు గడవకముందే మళ్లీ కరోనా సెకండ్ వేవ్ ముంచుకొచ్చింది. అంతే థియేటర్స్ మళ్లీ మూతపడ్డాయి. అయితే లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి థియేటర్స్ ఓపెన్ అయినా కాకపోయినా పసినీప్రియులు మాత్రం సినిమాలు చూడటం ఆపలేదు. ఎలాగంటే అందుబాటులో ఓటిటిలు ఉన్నాయి కదా.. అందులోను తెలుగు ప్రేక్షకులకు తెలుగు సినిమాలను అన్ని ఓటిటిలు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ - నెట్ ఫ్లిక్స్ - డిస్నీప్లస్ హిట్ స్టార్ - ఆహా లాంటి ఓటిటిలు ప్రస్తుతం కొత్తగా రూపొందుతున్న సినిమాలకు థియేటర్స్ గా మారిపోయాయి. అయితే ఇటీవలే స్టార్ హీరోయిన్ తమన్నా ప్రధానపాత్రలో 'లెవెన్త్ అవర్' అనే వెబ్ సిరీస్ తెరకెక్కి ఆహా ఓటిటిలో రిలీజ్ అయింది. అయితే మిల్కీబ్యూటీ ట్రైలర్ వరకు ఆకట్టుకున్నా వెబ్ సిరీస్ మాత్రం అంతలా ఆకట్టుకోలేకపోయింది. తమన్నాను చూసి అట్రాక్ట్ అయినప్పటికీ లెవెన్త్ అవర్ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కానీ ఫలితం ఎలా ఉన్నప్పటికీ అమ్మడు మాత్రం పాజిటివ్ గానే ముందుకు సాగుతుంది. తమన్నా గ్లామర్ బ్యూటీ కాబట్టి మరో ఇంటరెస్టింగ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతోంది. తమన్నా లీడ్ రోల్ లో 'నవంబర్ స్టోరీ' అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది.
రామ్ సుబ్రహ్మణ్యన్ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ఆనందవికటన్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది. అయితే తాజాగా నవంబర్ స్టోరీ వెబ్ సిరీస్.. డిస్నీప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ మొదలైంది. అయితే మిల్కీబ్యూటీ నటించిన ఈ ఫస్ట్ తమిళ వెబ్ సిరీస్.. మరి మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ మొత్తం ఏడు ఎపిసోడ్ లతో తెరకెక్కిందట. ప్రతి ఎపిసోడ్ కనీసంగా 36 - 52నిముషాల మధ్యలో నిడివి ఉన్నట్లు సమాచారం. అలాగే తమన్నా క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ వెబ్ సిరీస్ తెలుగు - హిందీ భాషల్లో కూడా డబ్ వెర్షన్ సబ్ టైటిల్స్ తో అందుబాటులోకి తీసుకురానున్నారు. మరి మంచి హైప్ తో రిలీజ్ అయినటువంటి నవంబర్ స్టోరీకి స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం తమన్నా పలు క్రేజీ సినిమాలతో బిజీగా ఉంది.