పాండమిక్ తర్వాత మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరో ఎవరైనా ఉన్నారంటే.. అది బాలయ్యే అని చెప్పాలి. కరోనా వైరస్ కారణంగా అందరూ వణికిపోతున్న పరిస్థితిల్లో సినిమా రిలీజ్ చేసి హిట్టు కొట్టాడు. డిజిటల్ కంటెంట్ కు విశేషమైన ఆదరణ లభిస్తున్న సమయంలో ఓటీటీలో హోస్టుగా అడుగుపెట్టి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మొట్టమొదటి బ్రాండ్ ఎండోర్స్ మెంట్ తో అడ్వర్టైజింగ్ వరల్డ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమా గతేడాడి చివర్లో విడుదలై.. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. వైరస్ భయంతో జనాలు థియేటర్లకు వస్తారో రారో అని అందరూ ఆలోచిస్తున్నప్పుడు.. ధైర్యంగా తన సినిమాని రిలీజ్ చేసి ఘనవిజయం సాధించారు. యాభై శాతం థియేటర్ ఆక్యుపెన్సీ.. తక్కువ టికెట్ రేట్లతోనూ భారీ కలెక్షన్స్ సాధించి ఇండస్ట్రీకి కళ తీసుకొచ్చారు.
తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' తీసుకొచ్చిన 'అన్ స్టాపబుల్' టాక్ షో ద్వారా బాలకృష్ణ ఓటీటీలో ఎంటర్ అయ్యారు. తొలిసారిగా హోస్టింగ్ చేసినప్పటికీ.. తనదైన శైలిలో అదరగొట్టాడు. కింగ్ ఆఫ్ టాక్ షోగా నిలిపారు. అంతేకాదు తనతో మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ.. దెబ్బకు అందరి థింకింగ్ మార్చజేశారు.
అప్పటి వరకు బాలయ్య మీద జనాల్లో ఉండే అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేయడానికి 'అన్ స్టాపబుల్' షో చాలా ఉపయోగపడిందని చెప్పాలి. ఇదే 'అఖండ' సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్ల వరకూ నడిచేలా చేసిందని అనుకోవచ్చు. ఇప్పుడు మాస్ గాడ్ క్రేజ్ ను క్యాష్ చేసుకోడానికి బ్రాండ్ కమర్షియల్స్ ఆసక్తి చూపిస్తున్నాయి.
ఇప్పటికే సాయి ప్రియా గ్రూప్ వెంచర్ అయిన 116 పారామౌంట్ కు బాలయ్య బ్రాండ్ అంబాసిడర్ గా ఆమోదం తెలిపారు. ఇప్పటికే రెండు కమర్షియల్స్ యాడ్స్ ను విడుదల చేసారు. తొలిసారి బాలకృష్ణ వాణిజ్య ప్రకటనలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక్కడ కూడ నటసింహం తన ప్రత్యేకత చాటుకున్నారు.
సాధారణంగా పెద్ద హీరోలు బ్రాండ్ కమర్షియల్స్ కు సైన్ చేసినప్పుడు.. తమకు ఫలానా స్టార్ డైరక్టర్ కావాలంటూ షరతులు విధిస్తుంటారు. ఆ కంపెనీలు కూడా తమ బ్రాండింగ్ కోసం హీరోల డిమాండ్లకు ఒప్పుకొని.. కేవలం కొన్ని గంటల పని కోసం లక్షలకు లక్షలు ఇచ్చి అగ్ర దర్శకులను తీసుకొస్తుంటారు. కానీ ఇప్పుడు బాలకృష్ణ మిగతా హీరోలకంటే తాను ఎందుకు ప్రత్యేకమో మరోసారి నిరూపించారు.
తొలిసారి కమర్షియల్ యాడ్ చేస్తున్నప్పటికే.. తన కాంపౌండ్ లోని బోయపాటి శ్రీను - గోపీచంద్ మలినేని - అనిల్ రావిపూడి వంటి దర్శకులు కావాలని బాలకృష్ణ డిమాండ్ చేయలేదు. డైరెక్టర్ ఎంపికను సదరు రియల్ ఎస్టేట్ కంపెనీకే వదిలేశారు. అవుట్ పుట్ ఎలా వస్తుందో.. ఎలా తీస్తారో అని ఆలోచించకుండా.. ఒక కొత్త డైరెక్టర్ తో తన మొట్టమొదటి యాడ్ లో నటించారు బాలయ్య.
సీనియర్ హీరో బాలకృష్ణ వ్యవహార శైలి, ఆలోచనా విధానం భిన్నంగా ఉంటుందని అందరికీ తెలుసు. అయితే ఇలాంటి విషయాలు ఆయన్ని మరింత ప్రత్యేకంగా నిలుపుతుంటాయి. ఏదేమైనా గత ఏడాదిగా నటసింహానికి గుడ్ టైం నడుస్తోందని చెప్పాలి. ఏది పట్టుకున్నా విజయం వరిస్తోంది. వచ్చే సంక్రాంతి కానుకగా 'వీర సింహా రెడ్డి' సినిమాతో రాబోతున్నరు. ఇది కూడా మంచి హిట్ గా నిలిచి బాలయ్య విజయాల పరంపరను కొనసాగిస్తుందేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.