ఇప్పుడు ఎక్కడ విన్నా అంతా 'ఆర్ ఆర్ ఆర్' గురించే మాట్లాడుకుంటున్నారు. వచ్చే ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాను గురించే చర్చించుకుంటున్నారు. ఈ సినిమా ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకోవడానికి మూడే మూడు ముఖ్య కారణాలు ఉన్నాయి. తిరుగులేని దర్శకుడు .. ఎదురులేని హీరోలు .. ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని కథగా ఆ కారణాలు కనిపిస్తాయి. ఒక వైపున రాజమౌళి సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు .. మరో వైపున ఎన్టీఆర్ అభిమానులు .. ఇంకోవైపున చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
దర్శకుడిగా రాజమౌళికి తిరుగులేదనే విషయాన్ని ఇంతవరకూ ఆయన తెరకెక్కించిన సినిమాలు నిరూపిస్తాయి. ఒక్కో విభిన్నమైన జోనర్లో ఆయన రూపొందించిన ఒక్కో సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వెళ్లింది. వినోదానికి సంబంధించిన అన్ని అంశాలను పొందుపరుస్తూ, యూత్ ను .. మాస్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించడం ఆయన ప్రత్యేకత. కథకు ఎక్కడా అడ్డుపడకుండా మరింత బలాన్ని చేకూర్చేలా గ్రాఫిక్స్ వాడటంలో ఆయన సిద్ధహస్తుడు. ఒక సాధారణమైన కథకు అన్నిరకాల హంగులు జోడించి నడిపించగల సమర్థుడు ఆయన. అందువల్లనే ఇంతవరకూ అపజయమనేది ఆయన దరిదాపుల్లోకి రాలేకపోయింది.
ఇక ఎన్టీఆర్ .. చరణ్ .. ఇద్దరూ కూడా ఎదురులేని హీరోలే. ఇద్దరికీ మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. యాక్షన్ విషయంలోను .. డాన్స్ విషయంలోను ఎవరి స్టైల్ వారిది. పవర్ఫుల్ డైలాగ్స్ తో సన్నివేశాలను పండించడంలోను ఇద్దరిదీ అందెవేసిన చెయ్యే. కొత్తదనం కోసం ఇద్దరూ కూడా సినిమా సినిమాకి 'లుక్' మార్చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తమ సినిమాలపై అంచనాలు తగ్గకుండా చూసుకుంటున్నారు. అలాంటి ఈ ఇద్దరూ 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో వచ్చే ఏడాదిలో ఆడియన్స్ ముందుకు రానున్నారు. ఈ సినిమాలో 'కొమరం భీమ్' గా ఎన్టీఆర్ .. 'అల్లూరి సీతారామరాజు'గా చరణ్ కనిపించనున్నారు.
రాజమౌళి .. ఎన్టీఆర్ .. చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'ఆర్ ఆర్ ఆర్' అనేక విశేషాల కలయికగా కనిపించనుంది. బలమైన కథాకథనాలు .. భారీ బడ్జెట్ .. భారీతారాగణం .. ఆశ్చర్య చకితులను చేసే గ్రాఫిక్స్ .. రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశాలు .. మనసును కట్టిపడేసే పాటలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అలాంటి ఈ సినిమా కోసం అటు నందమూరి అభిమానులు .. ఇటు మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వివిధ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆ అంచనాలను దాటిపోయి సరికొత్త సంచలనానికి రాజమౌళి తెరతీయడం ఖాయమనేది ఇండస్ట్రీ టాక్.